News April 13, 2024
ఈనెల 25 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

TG: ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు సొసైటీ డైరెక్టర్ శ్రీహరి తెలిపారు. మే 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఒక సెషన్, మ.2:30 నుంచి సా.5:30 వరకు మరో సెషన్ ఉంటుందని చెప్పారు. https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 3, 2026
HYD: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గడువు పెంపు!

సొంతంగా ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు కలెక్టర్ తీపి కబురు అందించారు. ఎస్సీ కార్పొరేషన్ (2025-26) స్వయం ఉపాధి రుణాల దరఖాస్తు గడువును ఈ నెల 8వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి ఏప్రిల్ 2వ తేదీతోనే ఈ గడువు ముగిసినప్పటికీ, మరికొంతమందికి లబ్ధి చేకూర్చేందుకు గడువు పెంచారు. అర్హులైన అభ్యర్థులు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News April 3, 2026
ICMR-NIIRND, రాజస్థాన్‌లో ఉద్యోగాలు

ICMR-NIIRND, రాజస్థాన్.. తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1, ప్రాజెక్ట్ నర్సు-2, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3 పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ లేదా పీజీతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. వయసు 30-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వూ తేదీ- APR-9. పూర్తి వివరాలకు www.icmr.gov.in చూడండి.
News April 3, 2026
ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్.సరస్వతి’

వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎస్.సరస్వతి’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉండగా, త్వరలో మరిన్ని భాషలను యాడ్ చేయనున్నారు. మార్చి 6న రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, రావు రమేశ్, మురళీ శర్మ, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.


