News December 17, 2024
ఇకపై ఆన్లైన్లో టెన్త్ సర్టిఫికెట్లు

AP: పదో తరగతి సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 50 ఏళ్ల క్రితం టెన్త్ చదివిన వారు కూడా డిజిలాకర్ నుంచి ధ్రువపత్రాలను ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1969-1990 సర్టిఫికెట్ల డిజిటైజేషన్‌కు విద్యాశాఖ తాజాగా అనుమతినిచ్చింది. ఆ తర్వాత 1991-2003 సర్టిఫికెట్లను డిజిటైజేషన్ చేయనుంది. 2004 తర్వాత టెన్త్ చదివిన వారివి ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది.
Similar News
News January 18, 2026
బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాజకీయాలు: CM CBN

AP: రాజకీయాలు చేయడం అంటే బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదని CM చంద్రబాబు అన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉన్నది NDA ప్రభుత్వం, CBN అని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. TDP కుటుంబ సభ్యుల కృషితోనే తాను సీఎం అయ్యానని తెలిపారు. అధికారం కోసం ఏనాడు ఆరాటపడలేదన్నారు. గొంతు మీద కత్తి పెట్టి TDPని విడిచిపెట్టమంటే ప్రాణాలు వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారని NTR 30వ వర్ధంతి కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
News January 18, 2026
చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే..

చలికాలంలో చర్మం నిస్తేజంగా, పొడిగా మారుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రోజుకు రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడంతో పాటు స్నానానికి గోరువెచ్చని నీరే వాడాలని చెబుతున్నారు. నిద్రపోయే ముందు నూనె, లోతైన మాయిశ్చరైజర్లతో స్కిన్ కేర్ చేసుకోవాలి. దీనివల్ల మృదువైన చర్మాన్ని పొందొచ్చు. తగినంత నీరు తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
News January 18, 2026
4 రోజుల్లో ₹14,266 కోట్లు ఔట్

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) గతవారం ఏకంగా ₹14,266 కోట్లు వెనక్కి తీసుకున్నారు. కేవలం 4 ట్రేడింగ్ సెషన్లలోనే ఈ భారీ అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, సుంకాల భయాల నేపథ్యంలో విదేశీ సంస్థలు తమ పెట్టుబడులను విత్‌డ్రా చేసుకుంటున్నాయి. అయితే దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIs) ₹16,174 కోట్లు పంప్ చేయడంతో మార్కెట్లు స్థిరంగా నిలబడగలిగాయి.


