News December 11, 2024

టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

AP: పదో తరగతి పరీక్షల <>షెడ్యూల్‌ను <<>>మంత్రి లోకేశ్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న మ్యాథ్స్, 26న ఫిజిక్స్, 28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకునేలా షెడ్యూల్ ఇచ్చామని, మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.

Similar News

News December 6, 2025

ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

News December 6, 2025

ఖలీ భూమిపై దుండగుల కన్ను.. ఏం చేశాడంటే?

image

ఒంటిచేత్తో నలుగురిని ఎత్తిపడేసే బలం ఉన్న WWE స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా) నిస్సహాయత వ్యక్తం చేశారు. హిమాచల్‌లోని పాంటా సాహిబ్‌లో కొందరు దుండగులు తన భూమిపైనే కన్నేశారని వాపోయారు. రెవెన్యూ అధికారుల అండతో వారు భూమిని ఆక్రమించడానికి యత్నించినట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతటి బడా సెలబ్రిటీకే ఈ దుస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

News December 6, 2025

గవర్నర్‌కు గ్లోబల్ సమ్మిట్‌‌ ఆహ్వానం

image

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రావలసిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈమేరకు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. CS రామకృష్ణారావు పాల్గొన్నారు. మరోవైపు మంత్రి అడ్లూరి హిమాచల్‌ప్రదేశ్, హరియాణా CMలు సుఖ్వీందర్ సింగ్ సుఖు, నాయబ్ సింగ్ సైనీలను కలిసి సమ్మిట్‌కు ఆహ్వానించారు.