News June 30, 2024
వెబ్సైట్లో టెన్త్ క్లాస్ షార్ట్ మెమోలు

AP: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షార్ట్ మెమోలను bse.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. గతంలో ఇచ్చిన షార్ట్ మెమోల్లో తప్పులను సరిచేసినట్లు పేర్కొన్నారు. కొత్త మెమోల్లో ఏమైనా తప్పులు ఉంటే జులై 6వ తేదీలోపు సంబంధిత ఆధారాలతో దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు.
Similar News
News December 12, 2025
నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి.. హైకోర్టులో పవన్ పిటిషన్

AP: తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ Dy.CM పవన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. AI వీడియోలతో పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా SMలో పోస్టులు చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. దీంతో డిలీట్ చేసేందుకు ఆ లింక్లను 48hrsలోపు SM సంస్థలకు అందించాలని న్యాయమూర్తి సూచించారు. వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర ప్లాట్ఫామ్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను DEC 22కు వాయిదా వేశారు.
News December 12, 2025
వాట్సాప్లో మరో 2 కొత్త ఫీచర్లు

మెసేజింగ్ యాప్ వాట్సాప్ రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోని వారికి వాయిస్ మెసేజ్ పంపే వెసులుబాటు కల్పించింది. వాయిస్ కాల్ చేస్తే వాయిస్ మెసేజ్, వీడియో కాల్ చేస్తే వీడియో మెసేజ్ పంపించే వన్ టచ్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. వాయిస్మెయిల్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఫ్లక్స్, మిడ్ జర్నీల సహకారంతో కొత్త తరహా ఇమేజ్లను క్రియేట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది.
News December 12, 2025
IIRSలో 11 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(IIRS)లో 11 JRF పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎంఎస్సీలో 60శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు NET,GATE అర్హత సాధించి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iirs.gov.in/


