News October 18, 2025
Oct 28 నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ

AP: వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి విద్యార్థికి ఈసారి తప్పనిసరిగా అపార్ ఐడీ(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎవరికైనా లేకపోతే వెంటనే చేయించాలని ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. అటు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
Similar News
News October 18, 2025
మహిళలకు వేపాకుతో చర్మ సౌందర్యం

* వేపాకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మ ఆరోగ్యం, సౌందర్యానికి వేపాకు ఎంతో మేలు చేస్తుంది.
* నీటిలో గుప్పెడు వేపాకులను వేసి మరిగించాలి. తర్వాత వడగట్టి ఆ కషాయాన్ని పడుకునే ముందు ముఖానికి రుద్దుకుంటే మొటిమలు, మచ్చలు, జిడ్డు దూరమవుతాయి.
* నీటిలో కలుపుకుని స్నానం చేస్తే ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
✍️ రోజూ స్కిన్, హెయిన్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 18, 2025
అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం వార్నింగ్

TG: ప్రభుత్వ స్కీముల అమలులో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులను CM రేవంత్ హెచ్చరించారు. CMO కార్యదర్శులు, CSతో సమావేశమయ్యారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. అన్ని విభాగాల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలి. ఫైళ్లు, పనులు ఆగిపోవడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు.
News October 18, 2025
RTC బస్సులు స్టార్ట్ అయ్యాయ్!

తెలంగాణలో బంద్ ప్రభావం తగ్గడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు ఎలక్ట్రిక్ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో 2,600 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం నుంచే వివిధ బీసీ సంఘాలు, రాజకీయ నేతలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి మీ ప్రాంతంలో బంద్ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.