News March 22, 2025
టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.
Similar News
News March 22, 2025
డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన

AP: నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో DMK నిర్వహించిన సమావేశానికి తమకు ఆహ్వానం అందిందని జనసేన వెల్లడించింది. అయితే వేర్వేరు కూటములలో ఉన్నందున హాజరుకాలేదని తెలిపింది. పార్టీ అధ్యక్షుడు పవన్ సూచన మేరకు DMKకు సమాచారం అందించామని పేర్కొంది. సమావేశంలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. డీలిమిటేషన్‌పై తమకు ఓ విధానం ఉందని, దీన్ని ఓ సాధికార వేదికపై వెల్లడిస్తామని ప్రకటించింది.
News March 22, 2025
నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్

AP: తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను గౌరవిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ కులం, మతం పాటించలేదని చెప్పారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలోని బుడగ జంగాలకు న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించా. ఇకపై ప్రతి జిల్లాలో పర్యటిస్తా. క్యాంపు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News March 22, 2025
కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?

శీతల పానీయాల్లో మైక్రోప్టాస్టిక్‌లు ఉన్నట్లు థాయిలాండ్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలింది. ప్యాకేజీతో సంబంధం లేకుండా మొత్తం 9 బ్రాండ్లలో మైక్రోప్లాస్టిక్ గుర్తించారు. ఏడాదికి ఓ వ్యక్తి సగటున 41.13 లీటర్ల కూల్‌డ్రింక్స్ తాగుతున్నట్లు గుర్తించారు. కూల్‌డ్రింక్స్ జీవక్రియ, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. మైక్రోప్లాస్టిక్ శరీరంపై చూపే ప్రతికూల ప్రభావాల గురించి మరింత పరిశోధనలు చేయనున్నారు.