News March 12, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 3,450 సెంటర్లలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 156 ఫ్లైయింగ్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ నం. 08662974540.
Similar News
News March 13, 2025
WPL: గెలిస్తే ఫైనల్‌కే

WPL 2025లో ముంబై, గుజరాత్ మధ్య ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. ఈ టోర్నీలో గుజరాత్‌పై ముంబై ఇప్పటివరకు ఓటమి లేకుండా సాగుతోంది. దీంతో ఇవాళ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ ఫైనల్ చేరింది. FINAL మ్యాచ్ ఎల్లుండి జరగనుంది.
News March 13, 2025
నాని సవాల్.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే

తాను నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ సినిమా నచ్చకపోతే ‘హిట్-3’ చూడొద్దని హీరో నాని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘కోర్టు’ మూవీని సినీ ప్రముఖులు, మీడియాకు ప్రీమియర్ షో ప్రదర్శించారు. మూవీ చూసిన దర్శకుడు శైలేష్ కొలను తన సినిమా(హిట్-3) సేఫ్ అని ట్వీట్ చేశారు. కోర్టు మూవీ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
News March 13, 2025
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు

TG: ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఈ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. దీని పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు, 7 మండలాలు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు ధీటుగా దీనిని ప్రభుత్వం ఫోర్త్ సిటీగా అభివర్ణిస్తోంది.