News April 24, 2024

టెన్త్.. రాష్ట్ర చరిత్రలో అత్యధిక మార్కులు

image

AP: నిన్న టెన్త్ ఫలితాల్లో 600కు 599 మార్కులు సాధించిన ఏలూరు జిల్లా విద్యార్థిని మనస్వి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇవే అత్యధిక మార్కులు. 2022లో 598, 2023లో 597 మార్కులు రాగా.. ఇప్పుడు ఆ రికార్డులను మనస్వి బద్దలుకొట్టారు. మనస్వి తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. వారి గైడెన్స్ తనకెంతో ఉపయోగపడిందని, ఐఐటీలో కంప్యూటర్ కోర్స్ చేస్తానని చెబుతున్నారు ఈ సరస్వతీ పుత్రిక.

Similar News

News December 3, 2025

చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్

image

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 358/5 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(105) వన్డేల్లో తొలి సెంచరీ బాదారు. కోహ్లీ(102) వరుసగా రెండో వన్డేలోనూ శతకం నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో అర్ధసెంచరీ(66*) చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్ 2, బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీశారు.

News December 3, 2025

రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

image

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.

News December 3, 2025

లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

image

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.