News December 30, 2024
యూట్యూబ్‌లో టెన్త్ పేపర్.. నిందితుడు అరెస్ట్

AP: టెన్త్ హాఫ్ ఇయర్లీ పరీక్ష పేపర్లను యూట్యూబ్‌లో <<14900742>>అప్‌లోడ్ చేసిన<<>> అరుణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఎడ్యుకేషన్ కౌన్సిల్‌లో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామ్‌కు ముందు రోజు మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్‌ను అరుణ్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను రద్దు చేసి ఈ నెల 20న నిర్వహించారు.
Similar News
News February 14, 2026
విమానంలో బాంబు ఉందంటూ లిప్‌స్టిక్‌తో రాసి..

అస్సాం నుంచి కోల్‌కతా బయల్దేరిన ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఫ్లైట్‌లో బాంబు ఉందంటూ లిప్‌స్టిక్‌తో రాసిన పేపర్ వాష్‌రూమ్‌లో లభించింది. సిబ్బంది వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేయడంతో అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేపట్టారు. నిన్న షిల్లాంగ్ నుంచి కోల్‌కతా బయల్దేరిన ఇండిగో విమానానికీ బాంబ్ బెదిరింపు వచ్చింది.
News February 14, 2026
నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!

రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో నిన్న తెలుగులో రిలీజైన మలయాళ మూవీ ‘చథా పచ్చ’ వారానికే OTTలోకి రానుంది. ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 22న మలయాళంలో రిలీజైన ఈ మూవీ రూ.30కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్టార్ హీరో మమ్ముట్టి ఇందులో అతిథి పాత్రలో మెరిశారు. రెజ్లింగ్ క్లబ్ ఏర్పాటులో ముగ్గురు అన్నదమ్ములకు ఎదురైన సవాళ్ల ఇతివృత్తమే కథ.
News February 14, 2026
కొత్తగూడెంపై కమ్యూనిస్ట్ జెండా.. CPIకి కాంగ్రెస్ మద్దతు!

TG: హంగ్ ఏర్పడ్డ కొత్తగూడెం కార్పొరేషన్‌పై అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీపీఐకి మద్దతు తెలుపుతూ మేయర్ పీఠం ఆఫర్ చేసినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని కమ్యూనిస్ట్ నేతలతో సీఎం రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్‌పై కమ్యూనిస్ట్ జెండా ఎగరనుంది. అటు ఇప్పటికే తామూ CPIకి మద్దతు ఇస్తామని BRS ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.


