News April 24, 2024

టెన్త్ ఫలితాలు.. 600కు 599 మార్కులు

image

AP: టెన్త్ ఫలితాల్లో ఆకుల వెంకట నాగసాయి మనస్వి అనే విద్యార్థిని సత్తా చాటారు. 600కు 599 మార్కులతో రికార్డు సృష్టించారు. సెకండ్ లాంగ్వేజ్‌ (99 మార్కులు) తప్ప అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు వచ్చాయి.

Similar News

News April 7, 2026

పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో.. రాజ్‌నాథ్ వార్నింగ్

image

భారత్‌తో యుద్ధం వస్తే ఈసారి కోల్‌కతా వరకు వస్తామంటూ పాక్ మంత్రి ఖవాజా పలికిన <<19571096>>ప్రగల్భాలపై<<>> రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలుసన్నారు. ‘ఖవాజా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. 55 ఏళ్ల కిందట ఇలాంటి మాటల వల్లే పాక్ రెండు ముక్కలైన విషయాన్ని మర్చిపోవద్దు’ అని చురకలంటించారు.

News April 7, 2026

అదొక్కటి సాధిస్తే ఇండియాలో 400 ఏళ్ల పాటు విద్యుత్ వెలుగులే(1/2)..

image

తాజాగా <<19586211>>కల్పాక్కం<<>>లో భారత్ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రాంలో సక్సెస్ సాధించింది. ఇది ఇండియాకు పెద్ద విజయం. మన దేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నందున అణు పితామహుడు హోమీ బాబా 3దశల ప్రణాళికను రూపొందించారు. మొదట సహజ సిద్ధమైన U-238తో విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో బై-ప్రొడక్ట్‌గా విలువైన ప్లుటోనియం-239 వెలువడుతుంది. ఇది తదుపరి దశలకు ఇంధనంగా మారుతుంది.

News April 7, 2026

అదొక్కటి సాధిస్తే ఇండియాలో 400 ఏళ్ల పాటు విద్యుత్ వెలుగులే(2/2)..

image

2వ దశ అయిన ‘ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల’ టెక్నాలజీలో భారత్ తాజాగా విజయం సాధించింది. ఇక్కడ రియాక్టర్‌లో థోరియంను ఉంచుతారు. దాన్ని ప్లుటోనియం సాయంతో యురేనియం-233గా మారుస్తారు. ఇక 3వ దశలో ఈ యురేనియం-233, థోరియంలను ఇంధనంగా వాడి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. మన దగ్గర థోరియం నిల్వలు పుష్కలం. మూడో దశ థోరియం ఆధారిత రియాక్టర్లు పూర్తయితే వచ్చే 300-400 ఏళ్ల పాటు ఇండియాకు విద్యుత్ కొరతే ఉండదు.