News April 24, 2024
టెన్త్ ఫలితాలు: ఈ స్కూళ్లలో అందరూ ఫెయిల్

AP: రాష్ట్రంలో 2,803 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ వెల్లడించారు. 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని(0%) చెప్పారు. ఈ 17 స్కూళ్లలో ఒకే ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉందన్నారు. ఇక 96.37% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా తొలి, 62.47%తో కర్నూలు జిల్లా చివరిస్థానాల్లో నిలిచాయి.
Similar News
News March 16, 2026
నేటి నుంచి ఏపీలో పది పరీక్షలు.. ఇవి చూసుకోండి

APలో టెన్త్ పరీక్షలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఉ.9.30-మ.12.45 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో 10AM వరకు అనుమతిస్తారు. OMR షీట్‌పై ఫొటో, పేరు, నంబరును తప్పకుండా సరిచూసుకోవాలి. 24 పేజీల బుక్‌లెట్‌లో జవాబులు రాశాక అవసరమైతే మరో 12 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. బ్లూ, బ్లాక్ పాయింట్ పెన్నులకు మాత్రమే అనుమతి ఉంటుంది.#ALL THE BEST
News March 16, 2026
ఈ తప్పులతో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి!

ఏమీ తినకున్నా కొన్నిసార్లు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి. దీనికి 4 కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి, ఒత్తిడి, ఫుడ్ స్కిప్ చేయడం, లేవగానే కాఫీ తాగడం వల్ల అసాధారణంగా షుగర్ పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ఉన్న వారికి ఇది హానికరమని అంటున్నారు. ‘రోజూ 7-8గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్, యోగా చేయాలి. సమయానికి తినాలి. ఖాళీ కడుపుతో కెఫీన్ పదార్థాలు తాగొద్దు’ అని సూచిస్తున్నారు.