News April 22, 2024
టెన్త్ ఫలితాలు ఆలస్యం!

AP: పదోతరగతి ఫలితాలు ఆలస్యంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉ.11 గంటలకు ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఉ.11.30 గంటలకు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఫలితాలు అరగంట ఆలస్యం కానున్నాయి. ఈసారి 6.03 లక్షల మంది టెన్త్ ఎగ్జామ్స్ రాశారు.
Similar News
News March 12, 2026
అక్షర్ పటేల్‌కు సారీ చెప్పిన కెప్టెన్ సూర్య

అక్షర్ పటేల్‌కు కెప్టెన్ సూర్యకుమార్ సారీ చెప్పారు. T20 WC S-8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతణ్ని తీసుకోకపోవడం తప్పేనని అంగీకరించారు. దీనిపై అక్షర్ కోపం వ్యక్తం చేశారని.. దాంట్లో తప్పులేదని అభిప్రాయపడ్డారు. గ్రూప్ స్టేజ్‌లో చివర నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా అక్షర్ ఆడలేదు. దీంతో SAతో మ్యాచ్‌లో వాషింగ్టన్‌ను సెలక్ట్ చేశారు. దాంట్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.
News March 12, 2026
ఇరాన్ కండీషన్స్ అమలు సాధ్యమేనా?

యుద్ధం ఆపడానికి ఇరాన్ పెట్టిన <<19359163>>కండీషన్స్<<>> నెరవేరడం సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఇరాన్‌లో పాలన మార్పు, అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్/US యుద్ధాన్ని ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హక్కులను గుర్తిస్తూ భద్రతకు హామీ ఇవ్వడం జరిగే పనికాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వడానికీ అగ్రరాజ్యం ఒప్పుకోదంటున్నారు. దీంతో యుద్ధం మరింత కాలం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
News March 12, 2026
కవిత ఇంటికి సీబీఐ అధికారులు

TG: మాజీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చారు. భర్త అనిల్ నోటీసులు తీసుకున్నారు. లిక్కర్ కేసులో ఇటీవల ఆమెకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. కాగా, న్యాయస్థానం నోటీసులను నేడు అధికారులు ఆమెకు అందజేశారు. 16న విచారణకు హాజరు కావాలని తెలిపారు.


