News April 20, 2024

టెన్త్ రిజల్ట్స్.. అందరికంటే ముందుగా..

image

AP టెన్త్ ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. RESULTS.BSE.AP.GOV.IN అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్‌ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News

Similar News

News February 10, 2026

గోర్లు విరిగిపోకుండా ఉండాలంటే?

image

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్​కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్​ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.

News February 10, 2026

రేపు సెలవు

image

TG: రేపు మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్మికశాఖ రేపు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో రేపు 7AM నుంచి 5PM వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో పోలింగ్ ముగిసే వరకూ మద్యం షాపులు మూసి ఉంటాయి.

News February 10, 2026

స్థిరంగా బంగారం, వెండి ధరలు

image

కొన్నిరోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,57,910, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,44,750 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.3 లక్షలుగా ఉంది.