News April 24, 2024

ఏప్రిల్ 30న టెన్త్ ఫలితాలు

image

TG: తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 30న (మంగళవారం) ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ విద్యా కమిషనర్ కార్యాలయంలో ఉ.11 గంటలకు ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అందరి కంటే ముందుగా WAY2NEWSలో వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News March 30, 2026

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ₹10వేల కోట్లు ఆదా: TGSRTC

image

TG: మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలకు ఆదా అయిన ఛార్జీల మొత్తం ₹10వేల కోట్లకు చేరినట్లు TGSRTC ప్రకటించింది. దాదాపు 290కోట్లకుపైన జీరో టికెట్‌ను మహిళలు వినియోగించుకున్నట్లు తెలిపింది. ఈ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య 40% నుంచి 67%కు పెరిగిందని వెల్లడించింది. ఒకప్పుడు రవాణా ఛార్జీలపై మహిళలు సగటున ₹1500-2500 వెచ్చించేవారని.. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని పేర్కొంది.

News March 30, 2026

నేడు RR vs CSK

image

ఐపీఎల్‌లో ఈరోజు మూడో మ్యాచ్ జరగనుంది. అస్సాంలోని బర్సపారా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రాజస్థాన్‌కు గత ఏడాది మొదటి మూడు మ్యాచ్‌లు కెప్టెన్సీ చేపట్టిన పరాగ్ ఈసారి ఆ జట్టుకు పూర్తిగా సారథ్యం వహిస్తారు. మరోవైపు CSKకు రుతురాజ్ సారథ్యం కొనసాగిస్తారు. ఇప్పటివరకు ఈ జట్లు 31సార్లు తలపడగా CSK 16, RR 15సార్లు గెలిచింది. ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.

News March 30, 2026

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

తిరుమలలో ఈరోజు నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ మూడురోజులూ స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు ఉ.8-10 మధ్య స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మూడు రోజులూ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.