News April 10, 2025
ఏప్రిల్ 22న టెన్త్ ఫలితాలు?

ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న లేదంటే రెండ్రోజులు అటూ ఇటుగా ఫలితాలు ప్రకటిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటితో మూల్యాంకనం పూర్తికాగా, ఫలితాలను కంప్యూటరీకరించే ప్రక్రియ మొదలుపెట్టారు. పలు దఫాల పరిశీలన పూర్తయ్యాక ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది. bse.ap.gov.in, Way2Newsలో ఫలితాలను తెలుసుకోవచ్చు.
Similar News
News November 17, 2025
సౌదీ ప్రమాదంలో భారతీయులు చనిపోవడం బాధాకరం: మోదీ

సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మదీనాలో జరిగిన ఈ ఘటనలో భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. రియాద్లోని భారత రాయబార కార్యాలయం & జెడ్డాలోని కాన్సులేట్ సాధ్యమైనంత సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. సౌదీ అధికారులతో సమీక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News November 17, 2025
ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు!

రంజీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా 8 వికెట్లతో రాణించారు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తొలి 5 వికెట్లను పడగొట్టిన శుక్లా, మొత్తంగా 20 ఓవర్లలో 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశారు. అతడి దెబ్బకు హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్లో 111 రన్స్కే ఆలౌటైంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టారు.
News November 17, 2025
యలమంచిలి ఎమ్మెల్యేపై పవన్ సీరియస్?

అచ్యుతాపురం (M) దుప్పితూరు భూ వివాదంలో MLA జోక్యం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో పవన్కళ్యాణ్ సీరియస్ అయినట్లు సమాచారం. పార్టీకి డ్యామేజ్ చేసే వ్యవహారాల్లోకి వెళ్లొద్దని మంత్రి నాదెండ్ల ద్వారా విజయ్కుమార్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అనవసర వ్యవహారాల్లో కలగజేసుకుని పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని పవన్ సూచించినట్లు సమాచారం. MLA నుంచి వివరణ కూడా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


