News April 22, 2024
నేడే టెన్త్ రిజల్ట్స్.. Way2Newsలో అందరికంటే ముందుగా..
AP పదోతరగతి ఫలితాలు ఇవాళ ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. bse.ap.gov.in సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఒకే క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్ కార్డ్ షేర్ చేసుకోవచ్చు. #ResultsFirstOnWay2News
Similar News
News November 20, 2024
ఈనెల 24న చెన్నైలో ‘పుష్ప-2’ ఈవెంట్!
‘పుష్ప-2’ సినిమా టీమ్ ఈనెల 24న చెన్నైలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 27న కొచ్చిలో ప్రమోషనల్ ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నాయి. బెంగళూరు, ముంబై, కోల్ కతా, HYDలోనూ ఈవెంట్స్ జరగనున్నాయి. ఇటీవల పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి 2 లక్షలకు పైగా జనం వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.
News November 20, 2024
డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
TG: ఉస్మానియా వర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 23వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెలలో పరీక్షలు జరగనుండగా, ఎగ్జామ్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు వర్సిటీ <
News November 20, 2024
గత పాలకులు తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టలేదు: పవన్
AP: ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం గ్రామానికి రూ.4లక్షల ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అంది ఉండేదన్నారు. వారి నిర్లక్ష్యంతో రంగు మారిన నీరు పైపుల ద్వారా వెళ్లిందని, గుడివాడలో ఈ సమస్య తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించామన్నారు. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత టైంలోగా మార్చాలని ఆదేశించారు.