News April 22, 2024
నేడే టెన్త్ ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా తెలుసుకోండి

AP: టెన్త్ ఫలితాలను ఇవాళ ఉ.11 గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. WAY2NEWS యాప్‌లో రిజల్ట్స్‌ను వేగంగా, సులభంగా తెలుసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
<<-se>>#ResultsFirstOnWay2News<<>>
Similar News
News March 4, 2026
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు?

జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుత పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగియనుండగా ప్రత్యేక పాలన విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏకసభ్య కమిషన్ నివేదిక, BC రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభానికి 3నెలలు పట్టే అవకాశం ఉంది. కమిషన్ నివేదిక ఆలస్యమైనా, రిజర్వేషన్ల అంశం కోర్టుకెక్కినా పంచాయతీ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు. అటు పరిషత్ ఎన్నికల తర్వాతే ‘పంచాయతీ’ నిర్వహించాలనే వాదనా ఉంది.
News March 4, 2026
ఇవాళ స్కూళ్లకు సెలవేనా?

చంద్రగ్రహణంతో ఈసారి హోలీ పండుగ ఎప్పుడనే గందరగోళం ఏర్పడింది. కొందరు నిన్నే రంగులు చల్లుకోగా.. AP, TG ప్రభుత్వాలూ స్కూళ్లకు మంగళవారమే సెలవు ఇచ్చాయి. అయితే గ్రహణం ఉండటంతో ఇవాళ(బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు తెలిపారు. కానీ స్కూళ్లకు నిన్నే పబ్లిక్ హాలిడే ఇవ్వడంతో ఇవాళ సెలవు లేదు. పిల్లలు బడికి వెళ్లాల్సిందే. అటు చాలావరకు ప్రైవేటు కార్యాలయాలకు ఇవాళ సెలవు ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీకూ ఉందా?
News March 4, 2026
దేశంలో 12% పెరిగిన ఉద్యోగ నియామకాలు

దేశంలో వైట్ కాలర్ జాబ్స్ నియామకాలు గత ఫిబ్రవరితో పోలిస్తే 12% పెరిగినట్లు నౌక్రీ సంస్థ రిపోర్ట్ వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకోవడం, ఐటీ రంగం కోలుకోవడమే ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఐటీ రంగంలో నియామకాలు 6% పెరగగా.. ఇందులో ఫ్రెషర్స్ హైరింగ్ 8% పెరిగినట్లు తెలిపింది. నాన్ ఐటీ రంగాల నియామకాల్లో ఇన్సూరెన్స్‌లో 28%, BPO 22%, రియల్ఎస్టేట్ 19%, హాస్పిటాలిటీలో 15%, రిటైల్ 14% గ్రోత్ నమోదైంది.


