News June 28, 2024

నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

image

TG: పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరిగాయి. వీటికి దాదాపు 51, 237 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను WAY2NEWSలో వేగంగా, సులభంగా తెలుసుకోవచ్చు.

Similar News

News April 10, 2026

ఇబ్రహీంపట్నం: ‘భూ భారతి రీ సర్వేకు సహకరించాలి’

image

ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో భూ భారతి రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ.. భూ భారతి రీ సర్వేకు వచ్చిన అధికారులకు రైతులు సహకరించాలని కోరారు. ఈ గ్రామం పునరావాసం గ్రామం కావడంతో హద్దులను పక్కాగా సరి చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్, సర్పంచ్ రక్షిత తదితరులు పాల్గొన్నారు.

News April 10, 2026

యువతికి HIV రక్తం.. కథ విషాదాంతం!

image

TG: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పరిధిలో పెళ్లికి నిరాకరించిందని మనోహర్ అనే వ్యక్తి గత నెల 11న ఓ యువతికి తన HIV రక్తాన్ని ఎక్కించిన <<19380551>>విషయం<<>> తెలిసిందే. ఓ సినిమాలో చూపించినట్లుగా ఉన్న ఈ సైకో తరహా చర్యతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురై ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. నిందితుడి పైశాచికత్వానికి ఓ నిండు ప్రాణం బలైంది. అతడిని కఠినంగా శిక్షించాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.

News April 10, 2026

ఇండియన్ రైల్వేలో అతిపెద్ద కనెక్టింగ్ పాయింట్!

image

UPలోని ‘మథుర జంక్షన్’ IND రైల్వేలో అత్యంత కీలకమైన కేంద్రమనే విషయం మీకు తెలుసా? ఇక్కడ దేశం నలుమూలల నుంచి వచ్చే 7 ప్రధాన రైలు మార్గాలు ఒకేచోట కలుస్తాయి. అందుకే రోజూ దాదాపు 190రైళ్లు ఇక్కడ ఆగుతుంటాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ముంబై నుంచి కోల్‌కతా వరకు దేశాన్ని ఏకం చేసే అతిపెద్ద జంక్షన్ ఇదే. ఆధ్యాత్మికంగా కృష్ణ జన్మభూమి కావడంతో పాటు, భౌగోళికంగా ఇది దేశాన్ని కలిపే ‘కనెక్టింగ్ పాయింట్’గా నిలుస్తోంది.