News March 25, 2024
ఘోరం.. ట్రక్కుతో తొక్కించి ఐదుగురిని చంపేశారు

రాజస్థాన్లోని ఝలావర్లో దారుణం జరిగింది. ఓ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు కొందరు బైకులపై వెళ్తుండగా ప్రత్యర్థులు ట్రక్కుతో తొక్కించేశారు. దీంతో ఇద్దరు సోదరులు భరత్ సింగ్(22), ధీరజ్ సింగ్(20) సహా ఐదుగురు ట్రక్కు టైర్ల కింద నలిగి చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు.
Similar News
News November 2, 2025
నా ఫ్యామిలీపై క్రిమినల్ కేసులు పెట్టారు: జస్టిస్ ఎన్వీ రమణ

AP: రాజ్యాంగ సూత్రాలను సమర్థించిన న్యాయవ్యవస్థ సభ్యులు బదిలీలు, ఒత్తిడిని ఎదుర్కొన్నారని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ కేసులు పెట్టారని చెప్పారు. వీఐటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతంలో జరిగిన అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతుల పోరాటమని గుర్తు చేశారు. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
News November 2, 2025
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

దక్షిణ మయన్మార్, ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఆవరించిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఇవాళ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని చెప్పింది. ఆ తర్వాత బలపడి బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతానికి ఈ అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలకు ముప్పు లేనట్లే తెలుస్తోంది. అటు ఏపీలో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నట్లు తెలిపింది.
News November 2, 2025
జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ అరెస్ట్!

AP: నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్ వాంగ్మూలం మేరకే జోగి రమేశ్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘జోగి రమేశ్ ప్రోద్బలంతోనే మద్యం తయారు చేశాం. వ్యాపారంలో నష్టపోయిన నాకు రూ.3కోట్లు ఇస్తానని రమేశ్ హామీ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టారు. ములకలచెరువులో జయచంద్రారెడ్డి సాయంతో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టమని సూచించారు’ అని రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.


