News April 4, 2024
ఘోరం.. భుజం తగిలిందని చంపేశారు

HYDలోని బేగంపేటలో ఘోరం జరిగింది. తరుణ్(18) మంగళవారం 10pmకు పాన్ షాప్‌కి వెళ్లాడు. అక్కడున్న సాయికిరణ్(21) భుజం తరుణ్‌కు తగిలి వాగ్వాదం మొదలైంది. సాయికిరణ్ ముగ్గురు రూమ్‌మేట్స్ శివశంకర్(24), ఎ.తరుణ్(21), పండు(22)లను తీసుకొచ్చాడు. దీంతో గొడవ ఘర్షణగా మారింది. ఆ నలుగురూ రూమ్‌లో కత్తి తీసుకొచ్చి.. తరుణ్‌ను పొడిచి పరారయ్యారు. తరుణ్ తల్లి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదైంది.
Similar News
News April 22, 2025
ఎల్లుండి నుంచి సెలవులు

APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి(APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న టీచర్లు ఇవాళ రిలీవై రేపు పాత స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు తెలంగాణలోనూ ఎల్లుండి నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. హాలిడేస్‌లో పిల్లలకు తరగతులు నిర్వహించరాదని అధికారులు ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టం చేశారు.
News April 22, 2025
ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదల

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మ.12 గంటలకు Dy.CM భట్టి విక్రమార్క రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 9.96 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ వస్తాయి. మార్కుల జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేసుకోవచ్చు.
News April 22, 2025
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించాలని విజ్ఞప్తి

TG: రాజీవ్ యువ వికాసం పథకానికి 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీనికి దరఖాస్తు గడువు ఈ నెల 14నే ముగిసింది. కాగా APR 30 వరకు పొడిగించాలని Dy.CM భట్టిని EBC నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి కోరారు. ఈ పథకం మొదటి జాబితాలోనే తమను ఎంపిక చేయాలని మంత్రులు, MLAలను నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పథకాన్ని మూడేళ్లు కొనసాగించాలని CM రేవంత్‌కు నేతలు విజ్ఞప్తి చేశారని సమాచారం.