News September 2, 2024
ఘోరం.. చనుబాలిస్తూ పసికందును చంపేసిన తల్లి

ఢిల్లీలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆరు రోజుల ఆడబిడ్డకు చనుబాలిస్తూనే తల్లి శివాని పసికందు గొంతునులిమి చంపేసి ఇంటిపై నుంచి విసిరేసింది. వరుసగా నాలుగోసారి ఆడపిల్లే పుట్టడంతో ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చంపేసిన తర్వాత బిడ్డ కనిపించట్లేదని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో గట్టిగా విచారించగా నిజం ఒప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
Similar News
News December 4, 2025
14,967 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయాల్లో 14,967 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ( ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు.
News December 4, 2025
పంటను బట్టి యూరియా వాడితే మంచిది

మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజనిని అందించే యూరియాను పంటను బట్టి ఉపయోగించాలి. వరి పంటకు యూరియాను బురద పదునులో వేయాలి. పెద్ద గుళికల యూరియాను వరి పైరుకు వేస్తే నత్రజని లభ్యత ఎక్కువ రోజులు ఉంటుంది. ఆరుతడి పైర్లకు యూరియాను భూమిపైన కాకుండా మొక్కల దగ్గర గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పివేయాలి. ఆరుతడి పంటలకు సన్నగుళికల యూరియా వేస్తే తేమ తక్కువగా ఉన్నా, తొందరగా కరిగి మొక్కకు అందుతుంది.
News December 4, 2025
త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రాహుల్ గాంధీ!

AP: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శిస్తారని AICC అధికార ప్రతినిధి సునీల్ అహీరా తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోహినూర్ వజ్రం లాంటిదని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇచ్చిన ప్లాంటును బీజేపీ అదానీకి అమ్మేస్తోందని, దాన్ని అడ్డుకుంటామని తెలిపారు. అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.


