News August 19, 2024

దాదులో ఉగ్ర‌దాడి.. సైనికుడి వీర‌మ‌ర‌ణం

image

జ‌మ్మూక‌శ్మీర్‌లోని దాదులో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో ఒక సీఆర్‌పీఎఫ్ జ‌వాను వీర‌మ‌ర‌ణం పొందారు. ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్‌లోని దాదు ప్రాంతంలో సైనికులు పెట్రోలింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్ర‌వాదులు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో గాయ‌ప‌డిన సీఆర్‌పీఎఫ్ జవాను ఒక‌రు మృతి చెందారు.

Similar News

News January 22, 2026

క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లపై పరిమితి విధించాలి: పురందీశ్వరి

image

క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాలని BJP MP పురందీశ్వరి కోరారు. వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు RBI మార్గదర్శకాలకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు వినతిపత్రం ఇచ్చారు. భారత్‌లో 24-48%, కొన్ని చోట్ల 55%+ వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ విధిస్తున్నారని, USలో వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేశారని గుర్తుచేశారు.

News January 22, 2026

భారత్ అంత చేసినా.. బరితెగించిన బంగ్లా!

image

భారత్‌లో T20 WC ఆడబోమన్న బంగ్లాదేశ్‌పై టీమ్ ఇండియా ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. వాస్తవానికి ఆ దేశ క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించిందే BCCI. 1988లో BCBకి అప్పటి ICC ఛైర్మన్ జగ్మోహన్ దాల్మియా ICCలో సభ్యత్వం ఇప్పించారు. తర్వాత BCCI ఆ జట్టుకు టెస్ట్ హోదా లభించేలా చేసింది. ఇంకా చెప్పాలంటే 1971లో పాకిస్థాన్‌తో పోరాడి బంగ్లాను స్వతంత్ర దేశంగా చేసిందే భారత్. బంగ్లా తీరుపై మీరేమంటారు?

News January 22, 2026

ఇది లొట్టపీసు కేసు.. బరాబర్ విచారణకు వెళ్తా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులు తప్ప పీకిందేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది లొట్టపీసు కేసు. ఇప్పటివరకు నేను ఆ నోటీసులే చూడలేదు. అయినా బరాబర్ విచారణకు వెళ్తా. ఎవరికీ భయపడేది లేదు. రేవంత్‌కు అసలే భయపడను. మేం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు వదిలిపెట్టం’ అని సిరిసిల్ల ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు.