News October 2, 2024

ఇజ్రాయెల్‌లో టెర్రర్ ఎటాక్.. ఆరుగురు మృతి

image

ఇజ్రాయెల్‌లో ఇరాన్ క్షిపణి దాడులకు ముందు టెర్రర్ ఎటాక్ జరిగింది. టెల్ అవీవ్‌లో జరిగిన ఈ దాడిలో ఆరుగురు చనిపోగా, 12 మందికి గాయాలైనట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 2, 2024

మాతో ఘర్షణకు దిగొద్దు: ఇరాన్ అధ్యక్షుడు

image

తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. ఈ దాడిని ఇజ్రాయెల్ దురాక్రమణకు ‘నిర్ణయాత్మక ప్రతిస్పందన’గా అభివర్ణించారు. ఇరాన్ యుద్ధభూమి కాదని, కానీ ఏదైనా ముప్పు ఉంటే దృఢమైన సంకల్పంతో దానికి వ్యతిరేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయం నెతన్యాహు తెలుసుకోవాలని, తమతో ఘర్షణకు దిగవద్దని ట్వీట్ చేశారు.

News October 2, 2024

రిషభ్ పంత్ సరదా మనిషి: లబుషేన్

image

టీమ్ ఇండియా ఆటగాళ్లందరిలోకీ భారత కీపర్ రిషభ్ పంత్ తనకు ఆసక్తికరంగా అనిపిస్తుంటారని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నారు. ‘పంత్ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటారు. కానీ నిజాయితీగా ఆడతారు’ అని పేర్కొన్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఏదో విధంగా ఆటను ప్రభావితం చేసే జడేజాను చూస్తే తనకు చిరాకు, అసహనం వస్తుందని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరదాగా వ్యాఖ్యానించారు.

News October 2, 2024

GREAT: కంటిచూపు లేకపోయినా..!

image

బెంగళూరుకు చెందిన 24 ఏళ్ల ఆయేషా బాను పుట్టుకతోనే అంధురాలు. అయినప్పటికీ తన ఉన్నతమైన స్పర్శ భావాన్ని ప్రాణాలు కాపాడే సాధనంగా మలుచుకున్నారు. డిగ్రీ చదివినా ఉద్యోగం దొరక్క ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు. సైట్‌కేర్ హాస్పిటల్స్‌లో మెడికల్ టాక్టైల్ ఎగ్జామినర్‌గా ఉద్యోగం పొంది ఎంతో మంది మహిళల ప్రాణాలు కాపాడారు. ‘మ్యాజిక్ ఫింగర్స్’ అనే స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా ఆమె రొమ్ము క్యాన్సర్ గడ్డలను గుర్తిస్తారు.