News March 30, 2025
ఆర్మీని తరలించడంతోనే జమ్మూలో ఉగ్రదాడులు: ఒమర్

జమ్మూలో ఉగ్రదాడులు పెరగడంపై J&K సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కఠువాలో చనిపోయిన నలుగురు పోలీసుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. చైనా చొరబాట్లను ఆపేందుకు జమ్మూ నుంచి సైన్యాన్ని లద్దాక్‌కు తరలించడాన్ని టెర్రరిస్టులు అనుకూలంగా మార్చుకున్నారని తెలిపారు. క్రమంగా ఈ పరిస్థితిని అధిగమిస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతలను మెరుగుపర్చేందుకు మరిన్ని చర్యలు అవసరమన్నారు.
Similar News
News April 1, 2025
ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ నేతలు

TG: ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిర్వహించే బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నాలో వారు పాల్గొంటారు. ధర్నాకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీలను మంత్రులు కోరనున్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, సీఎం రేవంత్, AICC నేతలు పాల్గొననున్నారు.
News April 1, 2025
శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు వేంకటేశ్వరుడి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,007 మంది భక్తులు దర్శించుకోగా.. 27,440 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి హుండీ ఆదాయం రూ.3.04కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
News April 1, 2025
ఏపీలో 3, 4 తేదీల్లో వర్షాలు

AP: రాష్ట్రంలో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. 3న రాయలసీమ, 4న ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. మరోవైపు, నిన్న రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడులో 40.3°C ఉష్ణోగ్రత నమోదైంది.