News January 4, 2025

కుంభమేళాకు ఉగ్రముప్పు

image

యూపీలోని ప్రయాగరాజ్‌లో జరిగే కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రమూకలు సాధువుల రూపంలో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Similar News

News January 6, 2025

ఎన్నికల బాండ్లు వస్తే అవినీతి ఎలా అవుతుంది?: కేటీఆర్

image

TG: గ్రీన్‌కో సంస్థ ఎన్నికల బాండ్ల రూపంలో <<15078396>>BRSకు రూ.41 కోట్లు<<>> చెల్లించిందని ప్రభుత్వం వెల్లడించడంపై కేటీఆర్ స్పందించారు. ‘2023లో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ జరిగింది. గ్రీన్‌కో ఎన్నికల బాండ్లు 2022లో ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ బాండ్లను కూడా ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ-కార్ రేసు కారణంగా గ్రీన్‌కో నష్టపోయింది. పార్లమెంటు ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు.

News January 6, 2025

అలాగైతే.. మళ్లీ టెలికం ఛార్జీలు పెంచక తప్పదు!

image

డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ రూల్స్‌పై టెలికం కంపెనీలు, న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్ డేటాను భారత్ బయటకు బదిలీ చేయడంపై రూపొందించిన రూల్స్ ఇంటర్నేషనల్ కాల్స్‌, మెసేజెస్, విదేశీ నంబర్లకు వాట్సాప్ మెసేజులు పంపడంపై ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. వీటిని అమలు చేయడం కష్టమని, చాలా ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. టెలికం ఛార్జీల రూపంలో ఈ భారమంతా కస్టమర్లపై వేయాల్సి వస్తుందని చెప్తున్నారు.

News January 6, 2025

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మొబైల్స్‌తో యువకులు

image

ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా సిగ్నల్స్ వద్ద పోలీసులు ఉండటం చూస్తుంటాం. కానీ, వియత్నాంలో సిగ్నల్స్ వద్ద యువకులు మొబైల్స్ పట్టుకొని అలర్ట్‌గా ఉండటాన్ని చూశారా? అక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించనివారి ఫొటోలను క్లిక్ చేసి పోలీసులకు పంపించడాన్ని కొందరు ఆదాయంగా మలుచుకున్నారు. ఇలా చేస్తే విధించిన జరిమానాలో 10శాతాన్ని బౌంటీగా వారికి పోలీసులు అందిస్తారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.