News April 24, 2025
ఉగ్రదాడి: ఆ సినిమా విడుదలపై నిషేధం

పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాను భారత్‌లో విడుదల కానిచ్చేది లేదని పశ్చిమ భారత సినీ ఉద్యోగుల సంఘం(FWICE) స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ‘ఉగ్రదాడుల నేపథ్యంలో భారత సినిమాల్లో పాక్ నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులపై నిషేధం విధిస్తున్నాం. భారతీయ సినిమా నుంచి ఎవరూ వారితో కలిసి పనిచేయకూడదు. అబిర్ గులాల్ సినిమాను భారత్‌లో నిషేధిస్తున్నాం’ అని అందులో పేర్కొంది.
Similar News
News April 24, 2025
చంద్రుడిపై చైనా, రష్యా అణు విద్యుత్ కేంద్రం!

చంద్రుడిపై అంతర్జాతీయ అణు విద్యుత్ కేంద్రాన్ని(ILRS) సంయుక్తంగా ప్రారంభించాలని చైనా, రష్యా ప్రణాళిక రచిస్తున్నాయి. ‘2028 కల్లా చంద్రుడిపై స్థావరానికి ఏర్పాట్లు మొదలుపెట్టాలని భావిస్తున్నాం. దానికి విద్యుత్ అందించేందుకు అణువిద్యుత్ కేంద్రం అవసరం. రోదసి ప్రయోగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న రష్యాతో కలిసి దాని నిర్మాణం కోసం పనిచేయాలని భావిస్తున్నాం’ అని చైనా పరిశోధకులు తెలిపారు.
News April 24, 2025
ఉగ్రదాడి: పాకిస్థాన్ అధికారుల సెలబ్రేషన్

పాక్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. పహల్గాం మారణహోమం తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుందని తెలుస్తోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఆ దేశ దౌత్యాధికారులు రాక్షసానందం పొందారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ ఉదయం హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు భారీగా చేరుకుని పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. PoKను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
News April 24, 2025
పహల్‌గామ్ ఉగ్రదాడిని ఖండించిన సీడబ్ల్యూసీ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ మీటింగ్‌లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పహల్‌గామ్ ఉగ్రదాడిని సీడబ్ల్యూసీ ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.