News February 26, 2025
రాజౌరీలో ఆర్మీ వెహికల్‌పై ఉగ్రదాడి

జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. నియంత్రణ రేఖ సమీపంలో టెర్రరిస్టులు ఆర్మీ వాహనంపై దాడిచేశారు. అడవిలో దాక్కున్న ముష్కరులు సుందర్‌బని సెక్టార్లోని ఫాల్ గ్రామంలో వెళ్తున్న వాహనంపై ఫైరింగ్ చేశారు. వెంటనే భారత జవాన్లు ప్రతిఘటనకు దిగారు. పారిపోయిన టెర్రరిస్టులను పట్టుకొనేందుకు ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించింది.
Similar News
News February 26, 2025
కేంద్రం-రాష్ట్రం వివాదం పిల్లల కొట్లాటలా ఉంది: విజయ్

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ విషయంలో తమిళనాడుకు, కేంద్రానికి మధ్య వివాదం చిన్నపిల్లల కొట్లాటలా ఉందని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఎద్దేవా చేశారు. పాలసీ అమలు చేయకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.2,400 కోట్లు నిలిపివేస్తామనటం అన్యాయమన్నారు. TVK పార్టీ వార్షికోత్సవ సభలో విజయ్ ప్రసంగించారు. BJP, DMK పార్టీలను ‘గెట్ఔట్’ హ్యష్‌ట్యాగ్ పెట్టి సాగనంపాలని పిలుపునిచ్చారు.
News February 26, 2025
ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం: CM

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నెల 1వ తేదీకి రూ.22,500 కోట్లు అవసరమని, ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే వస్తుందని చెప్పారు. జీతాలకు రూ.6500 కోట్లు, వడ్డీలకు రూ.6800 కోట్లు అవసరమని, ఆదాయం రూ.22 వేల కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అటు SLBCలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు.
News February 26, 2025
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఐపీఎల్ 2025 సీజన్‌కు తాను సిద్ధమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపారు. చీలమండ గాయం నుంచి తాను పూర్తిగా కోలుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఐపీఎల్, WTC ఫైనల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించినట్లు చెప్పారు. కాగా, చీలమండ గాయం కారణంగా కమిన్స్ కొద్ది రోజులుగా క్రికెట్‌కు దూరమయ్యారు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్, పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు.