News August 26, 2024

ఉగ్రవాదుల కాల్పులు.. 22 మంది మృతి

image

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పంజాబ్‌ను బలూచిస్థాన్‌తో కలిపే హైవేపై వారు బస్సులు, ట్రక్కులు, వ్యాన్‌లను నిలుపుతూ అందులోని వారిని తనిఖీ చేస్తూ కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 22 మంది మృతి చెందగా ఐదుగురికి గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. చనిపోయిన వారిలో 19 మంది పంజాబీలు, ముగ్గురు బలూచీలు ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మొత్తం 10 వాహనాలకు ఉగ్రమూకలు నిప్పు పెట్టాయి.

Similar News

News October 31, 2025

కేంద్ర సాయం వెంటనే అందేలా చూడాలి: CBN

image

AP: రైతులు నష్టపోకుండా పంటలను నీటి ముంపు నుంచి కాపాడాలని CM CBN అధికారులను ఆదేశించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ముంపు ప్రాంతాలను గుర్తించి శనివారం నాటికల్లా నీటిని మళ్లించాలని సూచించారు. పంట నష్టం ప్రాథమిక అంచనాల్ని తక్షణం రూపొందించాలన్నారు. కేంద్ర బృందాల్ని రప్పించి, అక్కడి నుంచి సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో బాగా పనిచేసిన 100 మందిని సత్కరించాలని చెప్పారు.

News October 31, 2025

శివమ్ దూబే ‘అన్‌బీటెన్’ రికార్డుకు బ్రేక్

image

2019 నుంచి ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉన్న 37 T20Iల్లో భారత్ గెలిచింది. ఇవాళ ఆసీస్ చేతిలో ఓటమితో ఆ లాంగెస్ట్ అన్‌బీటెన్ రికార్డుకు బ్రేక్ పడింది. అలాగే 2021 నుంచి బుమ్రా ఆడిన 24 మ్యాచుల్లో టీమ్ ఇండియా గెలవగా ఇవాళ పరాజయం పాలయ్యింది. ఉగాండాకు చెందిన పస్కల్ మురుంగి(2022-24) 27*, మనీశ్ పాండే(2018-20) 20* రికార్డులు అలాగే ఉన్నాయి.

News October 31, 2025

హార్ట్ ఎటాక్‌ను నివారించే మందుకు FDA అనుమతి

image

హార్ట్ ఎటాక్, స్ట్రోక్‌ ప్రమాదాన్ని నివారించే Rybelsus మందుకు అమెరికన్ FDA ఆమోదం తెలిపింది. ఇది నోటితో తీసుకునే తొలి GLP-1 ఔషధం కావడం గమనార్హం. ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్ రోగులు Rybelsusను వాడుతుండగా తాజాగా హృద్రోగులకూ విస్తరించారు. రక్తంలో చక్కెర స్థాయులు, ఆకలిని అదుపులో ఉంచడంతోపాటు గుండెపోటుకు ప్రధాన కారణాలైన రక్తనాళాల వాపు(ఆర్టీరియల్ ఇన్‌ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఇది తగ్గిస్తుంది.