News October 26, 2024

లాడెన్ నివాసంలో నేడు ఉగ్రసంస్థలు!

image

పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో లాడెన్‌ను అమెరికా అంతం చేసిన సంగతి తెలిసిందే. అతడు నివసించిన అదే భవనంలో నేడు మూడు ఉగ్రసంస్థలు శిక్షణనిస్తున్నట్లు సమాచారం. ఎన్డీటీవీ వివరాల ప్రకారం.. లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్ సంస్థలు ఆ భవనంలో ప్రస్తుతం ఉగ్ర శిబిరాలను నిర్వహిస్తున్నాయి. అది పాక్ సైన్యం అధీనంలో ఉన్న ప్రాంతానికి చెందిన భవనం కావడం గమనార్హం.

Similar News

News October 26, 2024

1000కి బదులు ఆంగ్లంలో K ఎందుకు వాడతామంటే..

image

వెయ్యి అని చెప్పడానికి బదులు K అన్న అక్షరం వాడటం నేడు సర్వ సాధారణంగా మారింది. ఉదాహరణకు 5వేలకు 5K అని అంటుంటాం. ఇది గ్రీకు పదం ‘Chilioi’ నుంచి వచ్చింది. చదివేందుకు ‘చిలివోయ్‌’లా కనిపిస్తున్నా దాన్ని కిలివోయ్‌గా పిలుస్తారు. ఆ కిలివోయ్ నుంచే కిలో అన్న పదం పుట్టింది. కిలోగ్రామ్ అంటే వెయ్యి గ్రాములు, కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు అన్నట్లుగా వెయ్యి అంకెకు ‘K’ని షార్ట్‌కట్‌లా వ్యవహరించడం మొదలైంది.

News October 26, 2024

Oxford University: భారతీయురాలి కలల్ని చిదిమేసింది

image

Oxford Universityలో ఇంగ్లిష్‌లో PhD చేస్తున్న TNకు చెందిన ల‌క్ష్మీ బాల‌కృష్ణ‌న్‌కు నిరాశే మిగిలిందే. PhD కోసం ₹కోటి వ‌ర‌కు ఫీజు చెల్లించిన యువ‌తి నాలుగో ఏడాదిలో షేక్‌స్పియ‌ర్‌పై చేసిన రీసెర్చ్ PhDకి తగ్గ స్థాయిలో లేద‌ని చెప్పి వ‌ర్స‌టీ ఆమెను బ‌ల‌వంతంగా మాస్ట‌ర్స్‌కు బ‌దిలీ చేసింది. రీసెర్చ్ ఆశించిన స్థాయిలో ఉండాలని, అందరూ దాన్ని సాధించలేరని వర్సిటీ పేర్కొంది. మోసపోయానని లక్ష్మీ ఆవేద‌న చెందింది.

News October 26, 2024

అక్టోబర్ 26: చరిత్రలో ఈరోజు

image

1965: సింగర్ నాగుర్ బాబు(మనో) జననం
1974: నటి రవీనా టాండన్ జననం
1985: హీరోయిన్ ఆసిన్ జననం
1991: హీరోయిన్ అమలాపాల్ జననం
1986: డైరెక్టర్ శైలేష్ కొలను జననం
1955: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి.పలుస్కర్ మరణం
✱గృహ హింస చట్టం అమల్లోకి వచ్చిన రోజు