News August 16, 2025
ధర్మవరంలో ఉగ్ర కలకలం

AP: శ్రీసత్యసాయి(D) ధర్మవరంలో ఉగ్ర కలకలం రేగింది. కోట ఏరియాలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో IB, NIA, స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పాకిస్థాన్‌కు అతను ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టీస్టాల్‌లో పనిచేస్తున్న నూర్ ఇంట్లో అనుమానిత వస్తువులు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులతో సంబంధాలపై NIA ఆరా తీస్తోంది.
Similar News
News August 16, 2025
పిల్లల్ని కనే రోబో.. 9 నెలల్లో డెలివరీ!

కృత్రిమ గర్భంతో పిల్లల్ని కనే రోబోను చైనా అభివృద్ధి చేస్తోంది. సింగపూర్ నాన్యాంగ్ వర్సిటీ సైంటిస్ట్ డా.జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ‘ప్రెగ్నెన్సీ రోబో’ను పరిశోధకులు డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఆర్టిఫీషియల్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌ను ప్రవేశపెట్టి, ట్యూబ్ ద్వారా న్యూట్రియెంట్స్ అందిస్తారు. 9 నెలల్లో శిశువు తయారవుతుంది. 2026 నాటికి రోబో నమూనా తయారవుతుందని, ఇందుకోసం ₹12.96L ఖర్చవుతుందని చెబుతున్నారు.
News August 16, 2025
సుంకాలపై మారిన ట్రంప్ వైఖరి!

పుతిన్‌తో భేటీ ముగిశాక ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై ప్రస్తుతం సెకండరీ టారిఫ్స్ విధించే అవసరం లేదు. 2-3 వారాల్లో దీనిపై మరోసారి ఆలోచిస్తా’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం ఇండియా దిగుమతులపై 25% టారిఫ్ అమలవుతోంది. అదనంగా మరో 25% సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. ట్రంప్ ప్రకటనతో ఈ టారిఫ్స్ నిలిచిపోయే అవకాశం ఉంది.
News August 16, 2025
ఆసియా కప్: ఫిట్‌గా సూర్యకుమార్ యాదవ్!

టీమ్ఇండియా టీ20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. గాయం నుంచి కోలుకున్న ఆయన ఆసియా కప్‌కు ముందు నిర్వహించిన టెస్టుల్లో పాస్ అయ్యారని వెల్లడించాయి. జట్టు ఎంపికకు ముందు ఈ వార్త సెలక్టర్లకు మరింత రిలీఫ్ ఇవ్వనుంది. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత సూర్య సారథ్యంలో జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే.