News November 1, 2024
IED బాంబు పేల్చిన ఉగ్రవాదులు.. ఏడుగురు మృతి

పాక్ బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్డ్ IED బాంబును పేల్చిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మస్తాంగ్ జిల్లాలోని సివిల్ ఆస్పత్రి చౌక్ వద్ద పోలీసు వ్యాన్ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. ముందుగానే పార్కింగ్ చేసిన బైక్‌లో బాంబులు ఉంచి రిమోట్ కంట్రోల్‌తో వాటిని పేల్చినట్టు మస్తాంగ్ DPO ఉమ్రానీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్కూల్ పిల్లలు, ఒక పోలీసు ఉన్నారు. మరో 17 మంది గాయపడ్డారు.
Similar News
News February 14, 2026
నిన్న థియేటర్లలో రిలీజ్.. వారానికే OTTలోకి!

రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో నిన్న తెలుగులో రిలీజైన మలయాళ మూవీ ‘చథా పచ్చ’ వారానికే OTTలోకి రానుంది. ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 22న మలయాళంలో రిలీజైన ఈ మూవీ రూ.30కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. స్టార్ హీరో మమ్ముట్టి ఇందులో అతిథి పాత్రలో మెరిశారు. రెజ్లింగ్ క్లబ్ ఏర్పాటులో ముగ్గురు అన్నదమ్ములకు ఎదురైన సవాళ్ల ఇతివృత్తమే కథ.
News February 14, 2026
కొత్తగూడెంపై కమ్యూనిస్ట్ జెండా.. CPIకి కాంగ్రెస్ మద్దతు!

TG: హంగ్ ఏర్పడ్డ కొత్తగూడెం కార్పొరేషన్‌పై అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీపీఐకి మద్దతు తెలుపుతూ మేయర్ పీఠం ఆఫర్ చేసినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని కమ్యూనిస్ట్ నేతలతో సీఎం రేవంత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్‌పై కమ్యూనిస్ట్ జెండా ఎగరనుంది. అటు ఇప్పటికే తామూ CPIకి మద్దతు ఇస్తామని BRS ఆఫర్ చేసిన విషయం తెలిసిందే.
News February 14, 2026
18 బంతుల్లోనే 50 రన్స్..

T20WCలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా(3 ఓవర్లు) 50 పరుగులు చేసిన రెండో టీమ్‌గా నిలిచింది. మార్క్రమ్ 14 బంతుల్లో 41, డికాక్ 4 బంతుల్లో 9 రన్స్ కొట్టారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 2016లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 2.5 ఓవర్లలోనే 50 బాదింది. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో SA పవర్ ప్లే ముగిసే సమయానికి 83/1 స్కోర్ చేసింది.


