News October 25, 2024

మంటల్లో టెస్లా కారు.. నలుగురు భారతీయులు మృతి

image

కెన‌డాలోని టొరంటోలో టెస్లా కారు డివైడ‌ర్‌ను ఢీకొన్న ప్ర‌మాదంలో గుజ‌రాత్‌కు చెందిన న‌లుగురు మృతి చెందారు. గుజ‌రాత్‌లోని గోద్రాకు చెందిన తోబుట్టువులు కెటా గోహిల్‌(30), నిల్ గోహిల్(26) సహా మరో ముగ్గురు వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు డివైడ‌ర్‌ను ఢీకొంది. దీంతో కారు బ్యాట‌రీ నుంచి పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగ‌డంతో న‌లుగురు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. మ‌రొక‌రిని అటుగా వెళ్తున్న వ్య‌క్తి ర‌క్షించారు.

Similar News

News February 7, 2026

క్రేజీ టైటిల్‌తో తరుణ్ భాస్కర్ మూవీ

image

ఈ నగరానికి ఏమైంది(ENE) సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. తర్వాత ‘కీడా కోలా’ చేసినా అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. దర్శకుడిగా చేస్తూనే నటుడిగానూ ప్రూవ్ చేసుకుంటున్నారు. ‘ENE2’ మూవీ చేస్తున్న తరుణ్ హీరోగా ఓ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి టైటిల్‌ను క్రేజీ డైలాగ్ ‘గాయపడ్డ సింహం’గా ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 9న టీజర్ విడుదల కానుందని పేర్కొన్నారు.

News February 7, 2026

అర్ధరాత్రి బిహార్ ఎంపీ అరెస్ట్

image

నాటకీయ పరిణామాల నడుమ బిహార్ ఎంపీ పప్పూ యాదవ్(రాజేశ్ రంజన్) అరెస్టయ్యారు. 1995 డాక్యుమెంట్ ఫోర్జరీ కేసులో ఆయనను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆయన పోలీసులతో అరెస్టుకు వారెంట్ లేదని వాగ్వాదానికి దిగారు. ఇవాళ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఢిల్లీ నుంచి పాట్నాలోని ఇంటికి చేరిన గంటలోపే పప్పూను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్ణియా లోక్‌సభ నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News February 7, 2026

బాలీవుడ్‌లో 90% పెళ్లిళ్లు ఫేక్: ‘హిట్-3’ నటుడు

image

బాలీవుడ్‌లో 90శాతం పెళ్లిళ్లు ఫేక్ అని ‘హిట్-3’ నటుడు ప్రతీక్ స్మిత పాటిల్ అన్నారు. ‘ప్రజలకు వాస్తవం ఏంటో తెలియదు. ఇండస్ట్రీలోని వారికే నిజాలు తెలుసు. ఏదో ఒక రోజు ఈ అంశాలు కథగా లేదా పుస్తక రూపంలో లేదా సినిమాగా రావచ్చు. ఒకరినొకరు మోసగించుకోవడం, పలువురితో సంబంధం కలిగి ఉండటం ఇక్కడ ఫ్యాషన్‌గా మారింది. పెళ్లి అంటే ఒక జోక్ అయింది’ అని భార్య ప్రియా బెనర్జీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.