News April 14, 2024
భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ.. అక్కసు వెళ్లగక్కిన చైనా

తమను కాదని విదేశీ సంస్థలు భారత్‌వైపు మొగ్గుచూపడంపై చైనా అక్కసువెళ్లగక్కింది. ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని స్థాపించేందుకు ఆసక్తి కనబర్చడాన్ని డ్రాగన్ తప్పుపట్టింది. ‘భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్ స్థాపిస్తే అది వర్కౌట్ కాకపోవచ్చు. స్థిరత్వం లేని, ఇంకా పూర్తిగా వృద్ధి చెందని మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం తొందరపాటు చర్య అవుతుంది’ అని చైనా అధికారిక పత్రిక ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
Similar News
News January 31, 2026
₹70,000 కోట్లకు చేరిన భారత స్పేస్ ఎకానమీ

భారత స్పేస్ ఎకానమీ ₹70,000Crకు చేరిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో వెల్లడించారు. ఇస్రో ఇప్పటివరకు 434 ఫారిన్ శాటిలైట్లను లాంచ్ చేసిందని, వాటి ద్వారా ₹4,800Cr ఆర్జించినట్లు తెలిపారు. స్పేస్ సెక్టార్‌లో ప్రైవేటు కంపెనీల ఇన్వెస్ట్‌మెంట్ పెరిగిందని, ప్రస్తుతం 399 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయన్నారు. రాబోయే 8-10 ఏళ్లలో ఈ రంగం 4-5 రెట్లు వృద్ధి చెంది ₹3.3-3.7లక్షల కోట్లకు చేరుకోవచ్చన్నారు.
News January 31, 2026
కోడి పిల్లలకు ‘పుల్లోరం’తో ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News January 31, 2026
శని త్రయోదశి రోజున ఏ నియమాలు పాటించాలి?

సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయాలి. మద్యమాంసాలకు దూరంగా ఉండాలి. నోటి నుంచి అసలు అసత్యాలే రాకూడదు. ఎవరి వద్ద నుంచి ఇనుము, ఉప్పు, నూనె వంటివి చేతితో తీసుకోకూడదు. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, మూగజీవాలకు ఆహారం ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు పాటించాలి. ఇతరుల పట్ల దయతో మెలగడం శనిదేవునికి అత్యంత ప్రీతికరం.


