News October 22, 2024
టెస్టు క్రికెట్: డౌన్ ట్రెండ్‌లో భారత బ్యాటింగ్!

బలమైన బ్యాటింగ్ లైనప్‌కు కేరాఫ్‌గా పేరున్న టీమ్ ఇండియా క్రమంగా బలహీనమవుతూ వస్తోంది. 2020 నుంచి సొంతగడ్డపై టెస్టుల్లో యావరేజ్ రన్స్ పర్ వికెట్ తగ్గిపోతూ వస్తోంది. 2015-19లో తొలి ఇన్నింగ్స్ సగటు 48.57 ఉంటే ఇప్పుడు 32.62కి పడిపోయింది. 2వ ఇన్నింగ్స్‌లో 53.93 నుంచి 36.58 రన్స్‌కి తగ్గింది. అటు మన పిచ్‌లపై విదేశీ బ్యాటర్ల రన్‌రేట్ పెరుగుతూ వస్తోంది. NZతో టెస్టులో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది.
Similar News
News January 15, 2026
సంక్రాంతి వేళ HYDలో DANGER

HYDలో ఎయిర్ క్వాలిటీ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్లో ఉండే ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున గాజులరామారంలో 239కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. 2, 3 రోజులుగా వాయు నాణ్యత తగ్గుతూ.. ఇవాళ ప్రమాదకర స్థాయికి చేరింది.
News January 15, 2026
ఇరాన్‌పై అమెరికా యుద్ధం?.. సిద్ధంగా డ్రోన్లు, విమానాలు!

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లో నిరసనకారులపై జరుగుతున్న హింసను అడ్డుకుంటామని హెచ్చరించిన ట్రంప్.. ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలోని US స్థావరాల నుంచి వందలాది యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఎయిర్ ట్యాంకర్లు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు తెలుస్తోంది. అటు ఇరాన్ కూడా ‘ప్రతీకార దాడులు తప్పవు’ అంటూ రివర్స్ వార్నింగ్ ఇచ్చింది.
News January 15, 2026
సన్‌స్క్రీన్ కొనేటప్పుడు ఇవి చూస్తున్నారా?

చర్మాన్ని UV రేస్ నుంచి కాపాడే సన్‌స్క్రీన్‌లో కొన్ని పదార్థాలు కలిస్తే హానికరంగా మారతాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే ఆక్సిబెంజోన్, మెథాక్సీసిన్నమేట్, అవోబెంజోన్ హార్మోన్లపై ప్రభావం చూపడంతో పాటు క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. అందుకే సన్‌స్క్రీన్ కొనేటప్పుడు లేబుల్ కచ్చితంగా చెక్ చేయాలని సూచిస్తున్నారు. ✍️సన్‌స్క్రీన్ వల్ల వచ్చే లాభనష్టాల గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధకేటగిరీ<<>>కి వెళ్లండి.


