News September 23, 2025

WIతో టెస్ట్ సిరీస్.. భారత జట్టు ఇదేనా?

image

వెస్టిండీస్‌తో OCT 2 నుంచి స్వదేశంలో జరగనున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు BCCI ఇవాళ జట్టును ప్రకటించే అవకాశముంది. కాలి గాయం నుంచి పంత్ కోలుకోకపోవడంతో టీమ్‌కు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో Cricbuzz 15 మంది సభ్యులతో ఎక్స్‌పెక్టెడ్ స్క్వాడ్‌ను ప్రకటించింది.
IND(అంచనా): గిల్(C), జైశ్వాల్, రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురేల్, జడేజా, సుందర్, అక్షర్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్, నితీశ్, జగదీశన్

Similar News

News September 23, 2025

APPLY NOW..IPRCLలో ఉద్యోగాలు

image

ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్(<>IPRCL<<>>)18 ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులు, 10 అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 10వరకు అప్లై చేసుకోవచ్చు. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ సైట్ ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32ఏళ్లు. వెబ్‌సైట్: https://iprcl.in/

News September 23, 2025

రబీ నుంచి ఆధార్‌పై ఎరువులు: అచ్చెన్నాయుడు

image

AP: వచ్చే రబీ సీజన్‌కు యూరియా సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రబీ నుంచి ఆధార్ కార్డు ఆధారంగా ఎరువులు సరఫరా చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఖరీఫ్ కోసం రాష్ట్ర అవసరాల మేరకు కేంద్రం నుంచి యూరియా తెప్పించామని, కొన్ని చోట్ల సరఫరాలో లోపాలు తలెత్తాయని, వాటిని సరిచేసుకొని ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 1.23 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.

News September 23, 2025

మైసూరులో ప్రారంభమైన దసరా ఉత్సవాలు

image

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా(నాడా హబ్బ) ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గ్రహీత, రచయిత్రి భాను ముష్తాక్, కర్ణాటక CM సిద్దరామయ్యతో కలిసి ఉత్సవాలు ప్రారంభించారు. చాముండేశ్వరి ఆలయంలో పుష్పవృష్టితో మొదలైన ఈ 11 రోజుల పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు ఉంటాయి. అక్టోబర్ 2న జంబో సవారితో ముగిసే ఈ వేడుకలు కర్ణాటక రాజవంశ వారసత్వాన్ని, ప్రగతిని ప్రదర్శిస్తాయి.