News January 26, 2026
TET ఫలితాలు.. కీలక అప్‌డేట్

TG: TET ఫలితాల్లో ఈసారి నార్మలైజేషన్ ప్రక్రియ ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఒకే సెషన్‌లో, ఒకే రకమైన క్వశ్చన్ పేపర్‌తో పరీక్షలు జరగడంతో నార్మలైజేషన్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్‌లోనూ ఈ అంశాన్ని పేర్కొనలేదు. కాగా 2 సెషన్లలో పరీక్షలు జరిగితే ఒక సెషన్ పేపర్ కఠినంగా, మరో సెషన్‌లో సులువుగా వచ్చే ఛాన్సుంటుంది. అలాంటి సందర్భాల్లో నార్మలైజేషన్ అమలు చేస్తారు.
Similar News
News February 12, 2026
విద్యార్థులు ఏమనుకుంటారు.. YCP ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆవేదన

AP: నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభలో వ్యవహరించిన <<19108172>>తీరుపై<<>> స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీకి వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు వచ్చారు. సభలో జరిగిన ఆ విధానాన్ని చూసి వారు ఏమనుకుంటారు. ఇంటికెళ్లిన తర్వాత వారు తోటి విద్యార్థులతో ఏం చెబుతారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో కాగితాలు చించి విసిరేశారు. అది సరైన పద్ధతేనా’ అని విచారం వ్యక్తం చేశారు.
News February 12, 2026
హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

*రెగ్యులర్‌గా హగ్ చేసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండె సంబంధిత రిస్కులు తగ్గుతాయి.
*స్ట్రెస్ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ రిలీజ్ కావడం వల్ల సహజంగా పెయిన్ రిలీఫ్‌గా పని చేస్తుంది.
*పడుకునే ముందు హగ్ చేసుకుంటే వేగంగా నిద్ర పడుతుంది.
**రోజుకు కనీసం 4 సార్లైనా (ఒక హగ్ 20 సెకన్లు) ఆత్మీయులను హగ్ చేసుకోవాలనేది నిపుణుల సూచన
>>ఇవాళ హగ్ డే.
News February 12, 2026
‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300కోట్లు?

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. ఈ చిత్రం బడ్జెట్ ‘RRR’ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ (రూ.1,200 కోట్లు) కంటే ఎక్కువ అని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు అంతర్జాతీయ మీడియా ‘వెరైటీ’ సైతం వారణాసి బడ్జెట్ దాదాపు రూ.1,300 కోట్లు($150M) అని పేర్కొంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలవనుంది.


