News May 19, 2024
రేపటి నుంచి టెట్ పరీక్షలు
TG: రేపటి నుంచి జరగనున్న టెట్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాల్లో జూన్ 6 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ప్రతిరోజు 2 సెషన్ల చొప్పున ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సా.4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. టెట్ పేపర్-1కి 99,958 మంది, పేపర్-2కి 1,86,428 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News December 23, 2024
FEB 1: సెలవు రోజైనా స్టాక్మార్కెట్లు పనిచేస్తాయ్
2025 FEB 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఆ రోజు బడ్జెట్ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. అందులో ప్రకటనలను అనుసరించి సత్వర నిర్ణయాలు తీసుకొనేందుకు ఇన్వెస్టర్లకు అవకాశమివ్వడమే దీని ఉద్దేశం. 2020, 2015లోనూ ఇలాగే జరిగింది. సాధారణంగా బడ్జెట్ రోజు బ్యాంకింగ్, ఇన్ఫ్రా, తయారీ, హెల్త్కేర్ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ రేట్లు నిమిషాల్లో ఆటుపోట్లకు లోనవుతుంటాయి.
News December 23, 2024
‘నో డిటెన్షన్’ విధానం రద్దు
స్కూళ్లలో ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని పేర్కొంది. ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లతో పాటు KVలు, నవోదయ, సైనిక్ స్కూళ్లకు ఇది వర్తించే అవకాశం ఉంది.
News December 23, 2024
ఖేల్రత్న జాబితా వివాదం: మనూభాకర్ పేరు డిలీట్?
మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూభాకర్ పేరు తొలగించినట్టు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది. వివాదం నెలకొనడంతో అవార్డుకు ఆమె దరఖాస్తు చేసుకోలేదని స్పోర్ట్స్ మినిస్ట్రీ చెప్తోంది. అది అవాస్తవమని, తాము చేశామని ఆమె తండ్రి రామకృష్ణ స్పష్టం చేశారు. అవార్డుల కోసం అడుక్కోవాల్సి వస్తే మెడల్స్ సాధించడంలో అర్థమేముందని ప్రశ్నించారు.