News July 26, 2024
మైనార్టీ విద్యార్థులకు టెట్ ఫ్రీ కోచింగ్: మంత్రి

AP: రాష్ట్రంలోని మైనార్టీ విద్యార్థులకు టెట్ పరీక్షకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. స్టడీ సెంటర్లు.. విజయవాడ CEDM కార్యాలయం, గుంటూరు AM కాలేజీ, ఆర్కే బ్రిలియంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కర్నూలు ఉస్మానియా కాలేజీ, విశాఖ ఆంధ్ర వర్సిటీ PG సెంటర్, జోయా కోచింగ్ సెంటర్(నంద్యాల), CEDM స్టడీ సెంటర్ (కదిరి).
Similar News
News December 9, 2025
తేగలు తింటే ఎన్ని లాభాలో..!

శీతాకాలంలో తాటి తేగలు (గేగులు) ఎక్కువగా లభిస్తుంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే తేగల్లో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత నివారణ, శరీర బరువును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. షుగర్ వ్యాధిగ్రస్థులూ తినొచ్చు. తాటి గింజలు మొలకెత్తినప్పుడు నేలలో నుంచి తవ్వి తీసిన మొలకలే ఈ తేగలు. మీరెప్పుడైనా టేస్ట్ చేశారా? comment
News December 9, 2025
శబరిమల: 18 మెట్లు – వాటి పేర్లు

1.అణిమ, 2.లఘిమ, 3.మహిమ, 4.ఈశత్వ, 5.వశత్వ, 6.ప్రాకామ్య, 7.బుద్ధి, 8.ఇచ్ఛ, 9.ప్రాప్తి, 10.సర్వకామ, 11.సర్వ సంవత్సర, 12.సర్వ ప్రియకర, 13.సర్వ మంగళాకార, 14.సర్వ దుఃఖ విమోచన, 15.సర్వ మృత్యుత్వశమన, 16.సర్వ విఘ్న నివారణ, 17.సర్వాంగ సుందర, 18.సర్వ సౌభాగ్యదాయక. ఈ 18 పేర్లు సిద్ధులు, సర్వ శుభాలకు ప్రతీక. ఇవి దాటితే అన్ని రకాల సౌభాగ్యాలను, విఘ్న నివారణను పొందుతారని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>
News December 9, 2025
క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

విండీస్ ఆల్రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.


