News December 27, 2024
టెట్ హాల్టికెట్లు విడుదల

TG: తెలంగాణ విద్యాశాఖ టెట్ హాల్ టికెట్లను విడుదల చేసింది. జనవరి 8, 9, 10, 18 తేదీల్లో టెట్ పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ఫలితాలు వెలువడనున్నాయి. హాల్ టికెట్ల కోసం ఇక్కడ <
Similar News
News October 30, 2025
‘స్పిరిట్’లో డాన్ లీ?.. కొరియన్ మీడియాలో వార్తలు!

ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల రిలీజ్ చేసిన సౌండ్ స్టోరీలో డాన్ లీ గురించి ప్రస్తావించలేదు. దీంతో అవి పుకార్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో స్పిరిట్లో డాన్ నటిస్తున్నారని కొరియన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆయన కనిపించే తొలి ఇండియన్ మూవీ ఇదేనంటున్నాయి.
News October 30, 2025
మైనార్టీకి మంత్రి పదవి ఇస్తాం: టీపీసీసీ చీఫ్

TG: కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, అందుకే మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలనుకున్నట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. <<18140326>>మంత్రి<<>> పదవికి అజహరుద్దీన్ పేరు ఫైనల్ అయినట్లుగా తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. జూబ్లీహిల్స్లో మైనార్టీల మీటింగ్ కోసమే అజహరుద్దీన్ తనను కలిశారని చెప్పారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో కూలుతుందన్న బీజేపీ ఇక చిలుక జోస్యం చెప్పుకోవాల్సిందేనని సెటైర్లు వేశారు.
News October 29, 2025
ఎల్లుండి నుంచి ఓటీటీలోకి 2 సినిమాలు

బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన కాంతార ఛాప్టర్-1, కొత్త లోక ఎల్లుండి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ‘కాంతార ఛాప్టర్-1’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, ‘కొత్త లోక’ జియో హాట్ స్టార్లో అందుబాటులోకి రానున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ‘కాంతార ఛాప్టర్-1’ రూ.800 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కొత్త లోక’ రూ.300కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.


