News October 10, 2025

నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్!

image

తెలంగాణలో వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. విద్యాశాఖ అధికారులు దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు. జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు, ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో 45వేల మంది టీచర్లు టెట్ రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ నిర్వహణ తర్వాత డీఎస్సీ ప్రకటన రావొచ్చు.

Similar News

News October 10, 2025

‘అరి’ రేటింగ్&రివ్యూ

image

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చుట్టూ తిరిగే సినిమానే ‘అరి’. మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తారనేది డైరెక్టర్ జయశంకర్ కథతో ఆవిష్కరించారు. సాయికుమార్, వినోద్ వర్మ, అనసూయ నటన మెప్పించింది. అనూప్ మ్యూజిక్, క్లైమాక్స్ బాగుంది. స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డారు. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లు వాస్తవ దూరంగా ఉండటం, కామెడీ పండకపోవడం మైనస్.
రేటింగ్- 2.5/5

News October 10, 2025

నలభై దాటిందా..ఇవి తినండి

image

నలభై ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఆరోగ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. సమయానికి ఆహారం తీసుకుంటున్నా కొన్నిసార్లు నీరసం కమ్మేస్తుంటుంది. కాబట్టి బ్యాలెన్డ్స్ డైట్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా అన్నిరకాల విటమిన్లు అందేందుకు తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఆహారంలో ఉండాలి. పాల ఉత్పత్తులు, మాంసాహారం, గుడ్లు తీసుకోవాలి. పీచు పదార్థాలతో పాటు నీటిని ఎక్కువగా తాగాలి. <<-se>>#WomenHealth<<>>

News October 10, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు: APSDMA

image

AP: ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్రవారం అత్యధికంగా కోనసీమ(D) నగరంలో 46MM, మలికిపురంలో 36.2MM వర్షపాతం నమోదైందని తెలిపింది.