News November 4, 2024
ఇవాళే టెట్ నోటిఫికేషన్

TG: ఇవాళ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మే, జూన్లో తొలి టెట్ నిర్వహించింది. ఇవాళ రెండో టెట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వనుండగా జనవరిలో పరీక్షలు జరపనుంది. మేలో నిర్వహించిన టెట్లో 1.09 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఇటీవల డీఎస్సీ కూడా పూర్తి కావడంతో ఈసారి పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Similar News
News September 14, 2025
368 పోస్టులకు RRB నోటిఫికేషన్

<
News September 14, 2025
అక్టోబర్ 1న అకౌంట్లోకి రూ.15,000

AP: వాహనమిత్ర కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 13నాటికి ఉన్న పాత జాబితాను పరిశీలిస్తారు. కొత్తవారు ఈ నెల 17-19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 22వ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి 24న అర్హుల జాబితా ప్రకటిస్తారు. అక్టోబరు 1న అకౌంట్లలో నగదు జమ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2.90లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం.
News September 14, 2025
నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

TG: నేడు రాష్ట్రంలోని 5 జిల్లాలకు వాతావరణశాఖ భారీ వర్షసూచన చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. నిన్న హైదరాబాద్తో పాటు కొన్ని జిల్లాల్లో వాన పడిన విషయం తెలిసిందే.