News July 1, 2024
నేడు టెట్ నోటిఫికేషన్.. వారంలో మెగా డీఎస్సీ!

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు నేడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. https://cse.ap.gov.in/ వెబ్సైటులో పరీక్షా వివరాలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణ తేదీపై ఇవాళ స్పష్టత రానుంది. ఆగస్టు నెలలో టెట్ నిర్వహించే ఛాన్సుంది. అలాగే మెగా DCSకి సంబంధించి వారం రోజుల్లో ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. టెట్, డీఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
Similar News
News December 10, 2025
బీట్రూట్తో హెల్తీ హెయిర్

అందంగా, ఆరోగ్యంగా ఉండే హెయిర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల చాలామంది జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారు. దీనికి బీట్రూట్ పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల తల్లోని జిడ్డు, చుండ్రు తగ్గుతాయి. దీంట్లోని ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మాడు రక్తప్రసరణను పెంచి కుదుళ్లను దృఢంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు.
News December 10, 2025
వ్యవసాయంలో విత్తనశుద్ధితో ప్రయోజనాలు

వ్యవసాయంలో విత్తనశుద్ధి చేయడం వల్ల.. విత్తనాలు, నేల ద్వారా ఆశించే తెగుళ్లు, పురుగుల నుంచి పంటను సంరక్షించవచ్చు. మొక్కలలో మొలకశాతం పెరుగుతుంది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి. విత్తనాలు త్వరగా మొలకెత్తి ఏకరీతిగా ఎదుగుతాయి. శుద్ధి చేయడం వల్ల విత్తనాలను ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు.
News December 10, 2025
వారికి త్వరగా పరిహారం అందాలి: D-HC

ఇండిగో ఫ్లైట్ల రద్దుతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు వీలైనంత త్వరగా పరిహారం అందించాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ‘ఎయిర్పోర్టుల్లో పడిగాపులున్న ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ, DGCA, ఇండిగో వీలైనంత త్వరగా పరిహారం అందిస్తాయని ఆశిస్తున్నాం’ అని ఇవాళ విచారణలో పేర్కొంది. అంతకుమందు కేంద్రం సరిగా స్పందించకే ప్రజలు ఇబ్బంది పడ్డారని <<18521287>>HC ఏకిపారేసిన<<>> విషయం తెలిసిందే.


