News September 24, 2024

TET: సందేహాల నివృత్తి కోసం ఫోన్ నంబర్లివే..

image

AP: టెట్ హాల్ టికెట్లలో తప్పులు ఉంటే పరీక్షా కేంద్రాల వద్ద నామినల్ రోల్స్‌లో సరి చేయించుకోవచ్చని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు ఈమెయిల్‌(grievences.tet@apschooledu.in)లో సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు ఇవే.. 9398810958, 6281704160, 8121947387, 8125046997, 7995789286, 9398822554, 7995649286, 9963069286, 9398822618.

Similar News

News November 27, 2025

జిల్లాలో 30 వరకు పోలీస్ యాక్ట్ అమలు

image

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని NOV 30 వరకు జిల్లావ్యాప్తంగా పోలీసు యాక్టు(1861)ను అమలు చేస్తున్నట్లు జిల్లా SP మహేష్ బీ గితే తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని.. నిబంధనలకు విరుద్ధంగా DJ వినియోగించొద్దని సూచించారు. శాంతిభద్రతలకు, ప్రభుత్వ ఆస్తులకు భంగం కలిగించవద్దన్నారు. SHARE IT.

News November 27, 2025

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఇవాళ మధ్యాహ్నం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 30న వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది.

News November 27, 2025

సారీ.. అంచనాలు అందుకోలేకపోయాం: పంత్

image

తాము సరిగ్గా ఆడలేదని ఒప్పుకోవడానికి సిగ్గు పడట్లేదని కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపారు. ‘జట్టుగా, వ్యక్తిగతంగా మేమెప్పుడూ హయ్యెస్ట్ లెవల్లో పర్ఫార్మ్ చేసి కోట్లమంది భారతీయుల ముఖాల్లో చిరునవ్వు తేవాలనుకుంటాం. ఈసారి ఆ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం. ఈ జట్టు ఏం చేయగలదో మాకు తెలుసు. ఈసారి జట్టుగా, వ్యక్తిగతంగా మంచి కంబ్యాక్ ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.