News November 5, 2024

TET RESULTS: మన విజయనగరం అమ్మాయికి 150/150 మార్కులు

image

టెట్‌ ఫలితాల్లో విజయనగరం అమ్మాయి కొండ్రు అశ్విని ఎస్జీటీ(పేపర్1-ఏ)లో 150కి 150 మార్కులు సాధించి ఏపీ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆటో డ్రైవర్ అయిన శంకర్రావు, తల్లి వెంకటలక్ష్మి ఆమె సాధించిన మార్కుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంచి టీచర్‌గా మారి పిల్లలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది. వీటి అగ్రహారానికి చెందిన ధనలక్ష్మి 149.99/150, చీపురుపల్లికి చెందిన హారిక 149.46/150 మార్కులు సాధించారు.

Similar News

News November 6, 2024

వైఎస్ జగన్‌తో భేటీ కానున్న విజయనగరం నేతలు

image

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ నేతలు బుధవారం భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో.. అభ్యర్థి ఎంపికపై ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ నేతలు, పలువురు ఆశావాహులు తాడేపల్లికి పయనమయ్యారు. వైసీపీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.

News November 6, 2024

VZM: డీఎస్సీలో పోస్టులు మినహాయించాలని వినతి

image

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిజన ఆశ్రమ పాఠశాల ఒప్పంద ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు మంగళవారం సాలూరులో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం విడుదల చేసే డీఎస్సీలో తమ పోస్టులు మినహాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు.

News November 6, 2024

VZM: ఎన్నికల నియమావళి అమలుకు బృందాల ఏర్పాటు

image

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, MRO, MPDO, SI సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో  MRO, MPDO, ఎస్ఐ ఈ బృందంలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.