News November 4, 2024

టెట్ ఫలితాలు.. సందేహాలుంటే ఈ నంబర్లకు కాల్ చేయండి

image

AP: రాష్ట్రంలో టెట్‌కు 3,68,661 మంది హాజరవగా 1,87,256 మంది <<14524941>>ఉత్తీర్ణత<<>> సాధించారు. వారందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రకటించారు. అభ్యర్థులకు సందేహాలుంటే ఉ.11.30 నుంచి సా.5.30 వరకు 9398810958, 7995649286, 6281704160, 7995789286 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

Similar News

News December 1, 2025

పెళ్లి చేసుకున్న సమంత!

image

స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరిద్దరి వివాహం జరిగినట్లు వెల్లడించాయి. ఈ కపుల్‌కు పలువురు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కాగా పెళ్లికి సంబంధించి ఈ జోడీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

News December 1, 2025

యువతకు ‘గీత’ చెప్పిన కర్మ సిద్ధాంతం ఇదే!

image

నేటి యువతరం భగవద్గీత నుంచి కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి. లక్ష్యంపై దృష్టి పెట్టి, ఫలితంపై ఆందోళన చెందకుండా తమ పనిని నిస్వార్థంగా చేయాలని గీత బోధిస్తుంది. మంచి జరిగినా, చెడు జరిగినా రెండింటినీ జీవితంలో భాగమే అనుకొని, ఏకాగ్రతతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి. ఈ ఆత్మవిశ్వాసం, నిలకడ నేటి పోటీ ప్రపంచంలో విజయానికి కీలకం. SHARE IT

News December 1, 2025

తెలంగాణ అప్‌డేట్స్

image

*రైతు భరోసా ఇవ్వకుండా కౌలు రైతులను ప్రభుత్వం మోసగించిందని BRS నేత హరీశ్ విమర్శించారు.
* టెట్ దరఖాస్తులలో వివరాల సవరణ గడువు నేటితో ముగియనుంది. పేరు, ఆధార్​, ఫోన్​ నంబర్​, అర్హతలు, సెంటర్లు మార్పు చేసుకోవచ్చు.
* కరెంటు సహా ఇతర బిల్లుల ఆధారంగా ‘ఆల్టర్నేటివ్ క్రెడిట్ స్కోరు’ ఇచ్చేందుకు ‘తెలంగాణ ఇన్ఫర్మేషన్ బ్యూరో (TIB)’ను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ స్కోరుతో బ్యాంకులు SHG సభ్యులకు లోన్లు ఇస్తాయి.