News March 17, 2024
స్కూల్ తొలిరోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు!
AP: ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరంలో బడులు తెరిచే తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 1-10 తరగతుల్లోని 42లక్షల మంది విద్యార్థులకు బైలింగువల్ పుస్తకాలను అందించనుంది. 1-5, 7వ తరగతి పుస్తకాల ముద్రణ బిడ్‌ను యూపీకి చెందిన పితాంబరా ప్రెస్ దక్కించుకుంది. మిగతా తరగతుల ముద్రణను స్థానిక MSMEలకు ప్రభుత్వం అప్పగించనుంది. ఆసక్తిగల కంపెనీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది.
Similar News
News November 24, 2024
ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్‌కు రూ.8.75కోట్లు
ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ రూ.8.45కోట్లకు కొనుగోలు చేసింది. ఇతను రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చారు. ఆల్‌రౌండర్ కావడంతో పలు జట్లు ఇతడిని తీసుకునేందుకు ఆసక్తి కనబరిచాయి. చెన్నై, బెంగళూరు మధ్య పోటీ నెలకొనగా చివరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది.
News November 24, 2024
మహ్మద్ సిరాజ్‌కు రూ.12.25కోట్లు
పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.12.25కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతను, చాలా సీజన్లుగా బెంగళూరు తరఫున ఆడుతున్నారు. సిరాజ్ ఐపీఎల్ కెరీర్లో 93 వికెట్లు తీశారు. బెస్ట్ 4-21.
News November 24, 2024
చాహల్‌కు రూ.18 కోట్లు
IPL మెగా వేలంలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అదరగొట్టారు. రూ. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇతను బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చారు. గత సీజన్లో ఇతను రాజస్థాన్ రాయల్స్ తరఫున కీలక సమయంలో వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.