News July 28, 2024

TFDAకు అండగా ఉంటా: విజయ్ దేవరకొండ

image

TFDA(తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్)కు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన దర్శక సంజీవని మహోత్సవ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ‘సక్సెస్ కాని డైరెక్టర్లు, ఆర్టిస్టులకు నెల జీతాలుండవు. ఆ జీవితం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నిత్యం జీవన పోరాటం చేయాల్సిందే. అందుకే నేను ఇండస్ట్రీలో ఉన్నంతవరకు వారికి అండగా ఉంటా’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

కృష్ణా: చోరీ అనుమానితుల ఫొటోలు విడుదల..!

image

మచిలీపట్నం మాచవరం సమీపంలోని పాత తౌడు ఫ్యాక్టరీ వద్ద రెండు రోజుల కిందట రెండు ఇళ్లలోకి చోరీకి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ 8332983789కు సమాచారం ఇవ్వాలని చిలకలపూడి సీఐ కోరారు. వీరిద్దరూ బైక్‌పై తిరుగుతుంటారని తెలిపారు.

News November 22, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

image

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.

News November 22, 2025

విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

image

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.