News May 20, 2024
పాయల్ వ్యవహారంపై స్పందించిన TFPC

‘రక్షణ’ ప్రమోషన్లలో హీరోయిన్ <<13279049>>పాయల్ రాజ్‌పుత్<<>> పాల్గొనడం లేదని సినిమా డైరెక్టర్, నిర్మాత ప్రణ్‌దీప్ నుంచి తమకు Mar 28న ఫిర్యాదు అందిందని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రకటించింది. ‘అది 4ఏళ్ల క్రితం సినిమా. OTTలో రిలీజ్ చేసుకోండి’ అని ఆమె చెప్పినట్లు ఆ ఫిర్యాదులో ఉంది. సినిమాకు 50రోజుల డేట్స్ ఇచ్చినా.. ఆమె 47 రోజులు మాత్రమే పని చేశారని, ప్రమోషన్స్ చేయాలని అగ్రిమెంట్లోనే ఉందని పేర్కొంది.
Similar News
News January 20, 2026
హరీశ్ రావును విచారించనున్న ఆరుగురు అధికారులు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. HYDలోని జూబ్లీహిల్స్ PSలో సీపీ సజ్జనార్ నేతృత్వంలోని ఆరుగురు అధికారుల బృందం ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా హరీశ్ వెంట ఆయన న్యాయవాది రాంచందర్‌రావును లోనికి అనుమతించలేదు. ఇప్పటికే ఈ కేసులో నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, బాధితులుగా పేర్కొన్న BJP నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్‌ను విచారించిన సంగతి తెలిసిందే.
News January 20, 2026
ఇంధన భద్రత దిశగా భారత్ కీలక అడుగు

విదేశీ గడ్డపై భారత్ చమురు వేట ఫలించింది. అబుదాబీలో భారీగా ముడి చమురు నిక్షేపాలు దొరకడం మన ‘ఇంధన భద్రత’ దిశగా కీలక అడుగు. క్రూడాయిల్ కోసం విదేశాలపై ఆధారపడే మనకు అక్కడ సొంతంగా నిక్షేపాలు ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రో రిసోర్సెస్ జాయింట్ వెంచర్ సాధించిన ఈ విజయం అంతర్జాతీయంగా మన దేశ శక్తిని పెంచడమే కాకుండా భవిష్యత్తులో ఇంధన కొరత లేకుండా దేశాన్ని మరింత బలోపేతం చేయనుంది.
News January 20, 2026
మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం

TG: మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో 67 మున్సిపాలిటీలలో 5 లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రెండో దశలో మున్సిపల్ ఎన్నికలకు ముందు 60 మున్సిపాలిటీల్లో పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో కోటి చీరల పంపణీ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు పంపిణీ చేసింది.


