News December 11, 2025
TGలో లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు: కేంద్రం

TGలో గత 10 నెలల్లో 1,40,947 రేషన్ కార్డులు రద్దయినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అనర్హులు, నకిలీ కార్డుల ఏరివేత, వలసలు, వ్యక్తుల మరణాలు వంటి కారణాలతో ఈ కార్డులు రద్దు చేసినట్లు తెలిపింది. e-KYC లేదా ఆధార్ వెరిఫికేషన్ కాలేదన్న కారణంతో ఒక్క కార్డు కూడా రద్దు కాలేదని పేర్కొంది. ప్రస్తుతం TGలో మొత్తం 56.60L, APలో 88.37L రేషన్ కార్డులున్నాయి. APలో ఈ ఏడాది 50,681 కార్డులు రద్దయ్యాయి.
Similar News
News December 15, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: కలెక్టర్ అనుదీప్

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేసే మాయమాటలు నమ్మవద్దని, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోకూడదన్నారు. అపరిచిత లింకులు తెరవవద్దని, మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News December 15, 2025
ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్‌కు అనర్హుడు: SC

ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్‌కు అనర్హులని SC పేర్కొంది. ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC PF మాత్రమే వస్తుందని, పెన్షన్ రాదని చెప్పింది. దీనిపై అతడు దావా వేయగా SC తాజా తీర్పు ఇచ్చింది. ‘VRకి పెన్షన్ వర్తిస్తుందన్నరూల్ ఉన్నా దానికి రిజైన్‌కీ తేడా ఉంది. రిజైన్‌తో పెన్షన్ రాదు’ అని పేర్కొంది. ఉద్యోగులకు ఈ తీర్పొక హెచ్చరికగా పలువురి సూచన.
News December 15, 2025
విద్యార్థులకు వేడి ఆహారమే ఇవ్వాలి: మంత్రి

AP: చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బీసీ హాస్టళ్లలోని విద్యార్థులకు తాజా, వేడి ఆహారం మాత్రమే అందించాలని బీసీ సంక్షేమ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే ఇవ్వాలని, గదుల్లో దోమలు చొరబడకుండా తెరలు వాడాలని సూచించారు. వార్డెన్లు హాస్టల్లో భోజనాన్ని ముందుగా రుచి చూడాలని, ఆ తరువాత విద్యార్థులందరితో కలిసి భోజనం చేయాలని ఉన్నతాధికారుల సమీక్షలో తెలిపారు.


