News December 10, 2025

TG గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా సిరిసిల్ల చీర

image

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో నల్లా విజయ్ ప్రత్యేకంగా ప్రదర్శించిన అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సిరిసిల్ల చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంగళవారం హైదరాబాద్‌లో హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్, హ్యాండ్ క్రాఫ్ట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాల్‌లో విజయ్ ఈ చీరను ప్రదర్శించగా సమ్మిట్‌లో పాల్గొన్న వ్యాపారవేత్తలు దీనిని ఆసక్తిగా తిలకించారు. చీరకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 30, 2026

AIFF చీఫ్ వేధించారు: మాజీ సీఎం కూతురు

image

ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF) చీఫ్ కళ్యాణ్ చౌబే తనను వేధించారని మహిళా అధికారి వాలంకా అలెమావో ఆరోపించారు. మార్చి 29న జరిగిన AIFF ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో చౌబే, ఇతర అధికారులు హేళన చేసి వేధించారని ఫిర్యాదు చేశారు. ‘నాపై అనవసర, అగౌరవకర వ్యాఖ్యలు చేశారు. నన్ను భయపెట్టేందుకు హద్దులు దాటి మాట్లాడారు’ అని పేర్కొన్నారు. గోవా Ex CM చర్చిల్ అలెమావో కూతురైన వాలంకా AIFF మహిళా కమిటీ చీఫ్‌గా ఉన్నారు.

News March 30, 2026

ASF: బైక్‌పై ముగ్గురి ప్రయాణం.. ప్రమాదాలకు ఆహ్వానం

image

ఓకే బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేయడం ప్రమాదకరమని ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ, వాహనదారుల్లో మార్పు కనిపించడం లేదు. కొందరు హెల్మెట్ లేకుండా, రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నారు. పోలీసులు చెబుతున్నది మన ప్రాణ రక్షణ కోసమే అయినా, చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రమాదం జరిగితే కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 30, 2026

HYD: ఆంకోవీ చేపల నూనెతో BPకి చెక్

image

OU ప్రొఫెసర్ సందీప్త సూక్ష్మజీవ శాస్త్రంలో కీలక పరిశోధనలు చేశారు. చేప నూనెలో రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ పరిశోధనకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి పేటెంట్ ధ్రువీకరణ లభించినట్లు తెలపారు. ముఖ్యంగా ఆంకోవీ చేపల్లోని అమైనో ఆమ్లాలను వినియోగించడం ద్వారా రక్తపోటును నియంత్రించోచ్చని రుజువు చేశామని స్పష్టం చేశారు.